మహేష్ ‘మహర్షి’ టీజర్‌ టాక్!

కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ…మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ టీజర్‌ వచ్చేసింది. అంచనాలను రెట్టింపు చేసేసింది. ‘సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు. కామాస్‌ మాత్రమే ఉంటాయి’ అంటూ హిట్ కొట్టబోతున్నాను అనే విషయం స్పష్టం చేసారు మహేష్‌బాబు.

‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినేషన్‌.. సక్సెస్‌ ఈజ్‌ ఏ జర్నీ’ అంటూ మహేష్‌ చెప్పిన డైలాగ్‌ జనాల్లోకి బాగా వెళ్తోంది. టీజర్ లో మహేష్‌బాబు చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘‘నాకో ప్రాబ్లమ్‌ ఉంది సర్‌. ఎవడైనా ‘నువ్వు ఓడిపోతావ్‌ అంటే’ గెలిచి చూపించడం నాకు అలవాటు’’ అనే పంచ్‌డైలాగ్‌ చెప్తూ ఫైట్ కు లీడ్ తీయటం కూడా మాస్ ఎంటర్టైనర్ అనే విషయాన్ని చెప్తోంది.

#JoinRishi - Maharshi Teaser | Mahesh Babu, Pooja Hegde | Vamshi Paidipally | Devi Sri Prasad | 4K

ఈ చిత్రంలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెల 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

రిషి ప్రయాణం ఎక్కడి నుంచి, ఎక్కడి వరకు సాగిందో తెరపైనే చూడాలంటోంది చిత్ర యూనిట్. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్‌లో పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.