మెగాస్టార్ “గాడ్ ఫాదర్” సినిమాపై మరో అదిరే అప్డేట్..అతి త్వరలోనే..!

లేటెస్ట్ గా టాలీవుడ్ లో టీజర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచుకున్న చిత్రం “గాడ్ ఫాధర్”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకుంది.

మరి తెలుగు సహా హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అయితే గతంలో వచ్చిన గ్లింప్స్ నెగిటివిటీని టీజర్ తో చెరిపేసారు. దీనితో ఒక కొత్త అంచనాలు అయితే ఈ చిత్రం నెలకొల్పుకోగా లేటెస్ట్ గా అయితే ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి రావడం వైరల్ గా మారింది.

ఈ సినిమాకి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి తాను అయితే రెండు అప్డేట్స్ బయటకి అందించాడు. ఈ చిత్రం నుంచి అయితే ఫస్ట్ సాంగ్ ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాలో మరో సాంగ్ ని అయితే ప్రముఖ లేడీ సింగర్ శ్రేయ ఘోషల్ లో పాడిస్తున్నట్టు తెలిపాడు.

అంతే కాకుండా ఇప్పుడు ఈ వారం స్టార్టింగ్ నుంచి ఈ సాంగ్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలిపాడు. మరి ఈ సాంగ్స్ అయితే ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా ఈ సినిమాలో సునీల్, సత్యదేవ్ లు కూడా నటిస్తుండగా మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేశారు.