RRR సినిమాపై కావాలని కాంట్రవర్సీ పోస్ట్ చేసిన హీరోయిన్.!

ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవెల్లో కూడా దర్శక ధీరుడు రాజమౌళి ఎపిక్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) సినిమా హవా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. దీనితో హీరోలు ఎన్టీఆర్ సహా రామ్ చరణ్ కి కూడా పాన్ వరల్డ్ లెవెల్లో భారీ గుర్తింపు వచ్చింది.

ఇక ఇలా అనేక దేశాల్లో సంచలనం రేపుతూ ఎంతో మందిని మెప్పిస్తున్న ఈ చిత్రంపై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కొమరం పులి హీరోయిన్ నికేష పటేల్ ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె ఏ ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టిందో కానీ అది మాత్రం ఖచ్చితంగా కావాలనే పెట్టి కాంట్రవర్సీ చెయ్యాలని చూస్తున్నట్టుగా అర్ధం అవుతుంది.

ఇప్పుడే నేను RRR సినిమా చూశానని నాకు అయితే సినిమా నచ్చలేదని. మళ్ళీ తనకి తానే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటూ కాంట్రవర్సియల్ పోస్ట్ పెట్టింది. ఇది అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పోస్ట్ అయితే తాను ఇప్పుడు కావాలనే పెట్టినట్టు ప్రూవ్ అయ్యింది.

గతంలో ఎన్టీఆర్ బర్త్ డే కి గాను ఎన్టీఆర్ పై విషెస్ తెలుపుతూ RRR లో ఎన్టీఆర్ నటన చాలా బాగుంది నాకు నచ్చింది అంటూ విషెస్ చెప్పింది. అదెప్పుడో కొన్ని నెలల కితం పోస్ట్ అయితే ఇప్పుడు ఈమె ఫ్రెష్ గా RRR సినిమా చూసినట్టు చెప్తుంది. దీనితో అయితే ఇపుడు పోస్ట్ కావాలనే కాంట్రవర్సీ చేయడానికి పెట్టినట్టు క్లియర్ గా అర్ధం అవుతుంది.