షాకింగ్ : నితిన్ తో జరిగిన మీటింగ్ పై ఇప్పుడు ఊహించని ట్విస్ట్..?

రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోస్ తో కేంద్ర స్థాయిలో నేతలు పావులు కదుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఇది స్టార్ట్ కాగా తర్వాత వెంటనే హీరో నితిన్ ని మరో ప్రముఖ బీజేపీ నేత జేపీ నడ్డా కలవడం సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది.

అయితే ఎన్టీఆర్ ని అమిత్ షా కలిసింది RRR లో ఎన్టీఆర్ నటన చూసి అనుకున్నట్టు అయితే మరి నితిన్ ని ఎందుకు కలిసారా అని అంతా అనుకున్నారు. పైగా తాను తీసిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ప్లాప్ ఆయే.. అయినా ఎందుకు కలిశారు అనేది దానిపై మరింత ఆసక్తిగా చర్చలా మారింది.

అయితే అంతా పొలిటికల్ కోణం లోనే ఎన్టీఆర్ మీట్ పై కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా బయటకొచ్చిన సమాచారం ఏమిటంటే బీజేపీ నేతలు మిస్టేక్ గా నితిన్ ని కలిసారని అంటున్నారు. ఇదెక్కడి ట్విస్ట్ అనుకుంటున్నారా?

అవును ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది. నిజానికి బీజేపీ నేతలు భారీ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ ని కలవబోయి నితిన్ ని కలిశారు అంటూ ఇప్పుడు టాక్ వైరల్ గా మారింది. మరి ఇది నమ్మదగేలా ఉంది కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం వాళ్ళకే తెలియాలి.