HBD Chiranjeevi : మెగాస్టార్ పై ఉప్పొంగిన అభిమానం.. మ‌హ‌మ్మ‌రీ వ‌ల్ల వేడుక‌ల హ‌డావుడి అంతా డిజిట‌ల్లోనే!

Megastar Chiranjeevi

మెగాస్టార్ పై అభిమానం ఉప్పొంగింది.. మ‌హ‌మ్మ‌రీ వ‌ల్ల ఈసారి వేడుక‌ల హ‌డావుడి అంతా డిజిట‌ల్లోనే కావ‌డం విశేషం! కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ల‌క్ష‌లాది అభిమానులు సోష‌ల్ మీడియాల్లో బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు.

మెగాస్టార్ చిరంజీవి .. క‌మ‌ర్షియల్ సినిమా లెజెండ్‌. మార్కెట్ ప‌రంగా స్టార్ డ‌మ్ కోణంలో తెలుగు సినిమాకి సిస‌లైన డెఫినిష‌న్ ఇచ్చిన మేటి స్టార్. నాలుగు దశాబ్ధాల కెరీర్ లో సౌత్ టాప్ హీరోల్లో ఒక‌రిగా త‌న‌ని తాను తీర్చిదిద్దుకునేందుకు ఎంత‌టి హార్డ్ వ‌ర్క్ చేసారో ఆయ‌న అభిమానులు ఎప్ప‌టికీ స్మ‌రిస్తూనే ఉంటారు. ఆయ‌న‌ను స‌న్నిహితులు అన్న‌య్యా అని అభిమానంగా పిలుచుకుంటే.. స్ఫూర్తిగా తీసుకుని ఈ రంగంలో ఎదిగిన వాళ్లు ఎంద‌రో. అందుకే నేడు మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ల‌క్ష‌లాది మంది త‌మ అభిమానాన్ని డిజిట‌ల్ వేదిక‌గా కురిపించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇప్ప‌టికి 151 సినిమాల్లో న‌టించిన ఆయ‌న త‌దుప‌రి చిత్రానికి మొద‌టి సినిమా హీరోలానే ప్రిపేర‌య్యారు. ఏ ఇత‌ర స్టార్ తో పోల్చినా ఆయ‌న‌కు ఉన్న ప్ర‌త్యేక‌తే ఆ హార్డ్ వ‌ర్క్. భేష‌జానికి పోని డౌన్ టు ఎర్త్ నేచుర్ అత‌డిని ఆ స్థాయిలో నిలిపాయి. మెగా వృక్షం నీడ‌లో ఇప్ప‌టికే డ‌జ‌ను మంది స్టార్లు పుట్టుకొచ్చి ప‌రిశ్ర‌మ‌లో ఉపాధిని సుస్థిరం చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

నేడు మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రామ్ చ‌రణ్ తొలి విషెస్ ని అందించ‌గా.. మెగా హీరోలంతా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై త‌మ అభిమానం చాటుకున్నారు. మెగాస్టార్ కి బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.

ఆయ‌న‌ చేసిన సినిమాలు ఇండ‌స్ట్రీలో మెగా స్టార్‌గా మ‌లిచాయి. అతను ప్రేమ కరుణను చూపే విధానం, అతను శ్రద్ధ వహించే విధానం, కుటుంబాన్ని నిర్వహించే విధానం, సమాజం పట్ల తనకున్న శ్రద్ధను చూపించే విధానం అతన్ని నాకు న్యూమెరో యునో మెగా స్టార్‌గా చేసాయి.. అంటూ సాయిధ‌ర‌మ్ ఉద్వేగానికి గుర‌య్యారు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ చిన్న‌ప్పుడు మావ‌య్య‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

ఎప్పటికప్పుడు నా అభిమాన హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూనే.. మెగాస్టార్ చిరంజీవి గారిని నా ధ‌న్య‌వాదాలు.. నా కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి పదాలు చిక్క‌వు.. అంటూ విన‌మ్ర‌త‌ను ప్ర‌ద‌ర్శించారు శిరీష్‌. శిరీష్ షేర్ చేసిన ఈ ఫోటో ప్ర‌స్తుతం అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

అలాగే మెగాస్టార్ న‌టించిన 151వ చిత్రం `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి వ‌రల్డ్ క్లాస్ విజువ‌ల్స్ ని ఇచ్చిన గ్రేట్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు త‌న అభిమానం చాటుకున్నారు. సైరా కు సంబంధించిన ప‌లు ఛాయాచిత్రాల్ని ఆయ‌న సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. లెజెండ్ అంటూ పొగిడేస్తూ అభిమానం చాటుకున్నారు. @chiranjeevikonidela #HBDMegastarChiranjeevi అంటూ సోష‌ల్ మీడియాల్లో డీపీని షేర్ చేశారు.