హాట్ టాపిక్ : “గాడ్ ఫాదర్” చెత్త ప్లానింగ్స్ తో యూనిట్ పై గట్టి విమర్శలు.!

ఓ సినిమాని ప్రేక్షకుల్లో తీసుకెళ్లడానికి చాలా కీలక ప్రమోషన్స్ అని చెప్పాలి. అవి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎక్కువగా ఉంటే ప్రేక్షకుల్లో సినిమా అంత బలంగా నిలుస్తుంది. దీనితో థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలాంటి స్టార్ హీరో సినిమాకి అయినా కూడా తప్పనిసరిగా అయిపోయాయి.

మరి వాటిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఏమీ అతీతం కాదు. అలా తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాదర్” చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ పాటలు అంటూ బాగానే స్టార్ట్ చేశారు. అలాగే నిన్నే సినిమా ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చెయ్యాలి. 

దీని కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం లాస్ట్ చేసి యూట్యూబ్ లో కొంచెం సమస్య వల్ల చెయ్యడం లేదని గత కొన్నాళ్ల నుంచి సినిమాలు చెప్తున్నా చెత్త రీజన్ నే పట్టుకొచ్చారు. దీనితో ముందే ఎన్నో రోజులు కితం సాంగ్ రిలీజ్ టైం ని కూడా ముందే ఫిక్స్ చేసుకొని లాస్ట్ లో టెక్నీకల్ సమస్య వల్ల చెయ్యట్లేదు అని చెప్పడం ఎలా  ట్రాకర్స్ విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా మెగా హీరోల సినిమాల విషయంలో ఇది బాగా రిపీట్ అవుతుందని అంటున్నారు. దీనితో ఇలాంటి చెత్త ట్రిక్స్ మూలాన ఉన్న హైప్ కూడా తీసుకున్నట్టు అవుతుంది. మొత్తానికి అయితే గాడ్ ఫాదర్ విషయంలో ఆడియెన్స్ కి మేకర్స్ చికాకు తెప్పిస్తున్నారు.