పొట్టి డ్రెస్సులో అందాలను ఆరబోస్తున్న అనసూయ.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన గ్లామర్ తో బుల్లితెరపై విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు. అలాగే ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా అనసూయ వెండితెరపై బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాటలలో నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా అనసూయ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఎన్నోసార్లు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.అయితే ఈమె వీటిని పట్టించుకోకుండా అలాంటివారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ మరింత రెచ్చిపోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా పొట్టి డ్రెస్ ధరించి ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈమెను సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ అనసూయ ఏంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది వరకు అనసూయ ఈ విధమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నప్పటికీ తన వస్త్రధారణలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.