(మోహన్)
బ్రిటీష్ పాలకులను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈయన జీవిత కథను `సైరా నరసింహారెడ్డి` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. చరిత్ర ఆధారంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటీష్ వారికి ఎదురు తిరగమని ప్రోత్సహించడంలోనూ.. ప్రణాళికా బద్ధంగా దాడులు చేయించడంలోనూ ఆయన గురువు పాపయ్యది కీలక పాత్ర.
అలాంటి పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. చిరంజీవిపై అభిమానంతో ఈ పాత్రలో అమితాబ్ నటించడానికి ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో పాత్ర కోసం అమితాబ్‌కి నిర్మాత రామ్‌చరణ్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడో తెలుసా?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం అమితాబ్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటిస్తున్నాడట. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకునే అమితాబ్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తున్నాడంటే ఏకైక కారణం.. ఆయనకు చిరంజీవిపై ఉన్న అభిమానమే కారణమని తెలుస్తున్నది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హిస్టారికల్ చిత్రం 200 కోట్ల రూపాయల బడ్టెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.