షాకింగ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ ?

లైగర్ .. ఏంటి లైగర్ అనే కొత్త తరహా టైటిల్ వినిపిస్తుంది అని షాక్ అవుతున్నారా .. ? ఎస్ ప్రస్తుతం ఇదే టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాద్ ? లేటెస్ట్ గా రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అంటూ సంచలన విజయాన్ని అందుకున్న పూరి జగన్నాద్ .. రౌడీ హీరో ల కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై లో ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. పూరి జగన్నాద్ తో పాటు బాలీవూడ్ ఫేమస్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత కావడంతో ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పెడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది .. కానీ తాజాగా ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ పెట్టాలని కరణ్ జోహార్ డిమాండ్ చేయడంతో అదే టైటిల్ పెట్టాలని ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు పూరి. ఇంతకీ లైగర్ అంటే ఏమిటో తెలుసా ? మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన పిల్లను లైగర్ అని అంటారట !! ఈ కథ ప్రకారంగా ఇదే టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడట. దానికోసం అయన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దగ్గరుండి హీరోయిన్ ఛార్మి అన్ని పనులు చూసుకుంటుంది. ఈ సినిమాకు ఆమెకూడా సహా నిర్మాతే. రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లోనే ప్లాన్ చేసారు. మరి టైటిల్ విషయంలో లైగర్ అని పెడతారా .. లేదా అన్నది తెలియాల్సి ఉంది.