నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ తాజాగా మంచి విజయం అందుకున్నాడు. ఇలా పెద్ద కొడుకు సినిమాల్లో స్థిర పడ్డాడు అనుకున్నాడో లేదో అప్పుడే తన చిన్న కొడుకుని రంగంలోకి దించాడు సురేష్.
బెల్లంకొండ గణేష్ హీరోగా అతని మొదటి చిత్రం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్లో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ మేరకు సాయి శ్రీనివాస్ ట్వీట్ చేసి అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. గణేష్ చిత్రానికి ‘ప్రేమ ఇష్క్ కాదల్’ దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నాడు. తన వయసుకు తగ్గ ప్రేమ కధా చిత్రం చేస్తున్నాడు.