దుల్కర్ సల్మాన్ #DQ41, #SLV10 హీరోయిన్ గా పూజా హెగ్డే

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా హెగ్డేను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పూజ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చూపించే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూజ స్కూటీ నడుపుతూ, దుల్కర్ వెనుక కూర్చుని, వారి మ్యాజికల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే సన్నివేశం ఆకట్టుకుంది.

ఈ చిత్రం దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఫస్ట్ కొలాబరేషన్ ని సూచిస్తుంది. దర్శకుడు రవి నెలకుడిటి ఒక హార్ట్ వార్మింగ్మ యూనిక్ ప్రేమకథను రెడీ చేశారు.

టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనయ్ ఓం గోస్వామి డీవోపీ, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.

గ్రాండ్ పాన్-ఇండియా మూవీ గా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో థియేటర్లలోకి రానుంది.

తారాగణం: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవి నేలకుదిటి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సహ నిర్మాత: గోపీచంద్ ఇన్నమూరి
CEO: విజయ్ కుమార్ చాగంటి
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: అనయ్ ఓం గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్