టాలీవుడ్ లో ఇప్పుడున్న సీనియర్ హీరోలలో వెంకటేశ్ దగ్గుబాటికి ప్రత్యేక స్థానం ఉంది. తన స్టార్ డమ్ ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉండే సినిమాలకు ప్రాధాన్యతనిస్తాడు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ బాబు బంగారం. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం వేసింది వెంకీనే. వెంకటేశ్ సినిమా అంటే కచ్చితంగా అది మినిమం గ్యారెంటీ సినిమా అనే చెప్పాలి. అందుకే ఆయనకు ‘విక్టరీ’ వెంకటేశ్ అనే పేరు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా 1986లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్, తన కెరియర్ లో ఇప్పటివరకు 72 సినిమాలు చేశాడు. ఆయన నటించిన 73 వ సినిమా వెంకీ మామ ఈరోజు రిలీజ్ కానుంది. 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న వెంకటేశ్ పుట్టినరోజు నేడు.
ఇక సాధారణంగా హీరోలు కామెడీ చెయ్యడం అనేది చాలా తక్కువ కానీ వెంకటేష్ కామెడీకి చాలా మంది ఫిదా అయిపోతారు. అలాగే వెంకటేష్‌కి ఎక్కువగా ఫ్మామిలీ ఆడియన్స్ కనక్ట్ అవుతారు. అలాగే ఒకప్పుడు యూత్‌ని ఆకర్షించే విధంగా తన సినిమాలో ఫారెనర్స్తో ఒక సోలో సాంగ్ ఉండేది. అది చాలా హిట్ అయ్యేది. యాక్షన్ విషయానికి వస్తే ఎనీ సెంటర్ గణేష్ అంటూ చెప్పే డైలాగ్ సూపర్.
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి కూడా ఎలాంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కు పోకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటున్న వెంకీ పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 13) ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాజ్యం తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఆయన గురించి క్లుప్తంగా.
తండ్రి కలను నిజం చేస్తూ హీరోగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వెంకటేష్ తన జనరేషన్లో టాప్ స్టార్స్ నలుగురిలో ఒకరిగా రాణించాడు. తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ఆకట్టుకున్న వెంకటేష్ విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు.
‘శ్రీనివాస కళ్యాణం’, ’స్వర్ణకమలం’, ’గణేష్’, ‘తులసి’, ‘లక్ష్మి’, ‘నువ్వునాకు నచ్చావ్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో నటుడిగా ఒక మూసకు పరిమితం కాలేదు. మరోవైపు ‘చంటి’, ‘సుందరకాండ’, ‘చినరాయుడు’, ‘పవిత్ర బంధం’, ‘రాజా’, ‘సంక్రాంతి’ లాంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. వీటితో పాటు ‘బొబ్బిలి రాజా’, ‘శత్రువు’, ‘ధర్మచక్రం’, వంటి మాస్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించాడు. ‘ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించుకుందాం..రా’, ‘వాసు’ లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యాడు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ సినిమా వెంకటేష్‌కు స్టార్డమ్ తీసుకొచ్చింది. మరోవైపు 1991లో వచ్చిన ‘చంటి’ వెంకటేశ్ కెరీర్లో మరో మైలురాయి. ఈ సినిమాలో అమాయక పాత్రలో వెంకీ నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా హిందీలో ‘అనాడి’గా రీమేక్ అయ్యింది.ఈ మూవీతో వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ పుట్టినరోజు వెంకటేష్‌కు ఎందుకు అంత స్పెషల్ అంటే సురేష్‌ప్రొడక్షన్స్‌లో వాళ్ళ సొంత బ్యానర్లో అక్కినేని చైతన్య తన సొంత మేనల్లుడితో కలిసి నటించిన చిత్రం వెంకీమామ. ఈ చిత్రం తన పుట్టినరోజు సందర్భంగా విడుదలకావడం అంతే కాక ఈ చిత్రంలో ఎన్నో ఎమోషన్స్‌ని ఆయన చూపించారు. వెంకటేష్, నాగచైతన్య, సురేష్‌బాబు అందరూ చాలా ఎమోషన్‌గా ఫీలయి చేసిన చిత్రమిది. అందరూ సొంత వాళ్ళు కావడంతో ఈ చిత్ర ప్రమోషన్ టైంలో వెంకటేష్ స్టేజ్ మీద మాట్లాడే ప్రతి సారి ఎంతో ఎమోషన్‌గా ఫీలయ్యారు.