వెంకీ మామ “సైంధవ్” లో అదే పెద్ద హైలైట్.. 

రాబోతున్న సంక్రాంతి సినిమాల్లో అయితే మంచి అంచనాలు నెలకొల్పుకుని ఉన్న చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ గా మన తెలుగు సీనియర్ స్టార్ హీరోస్ వెంకటేష్ నటించిన భారీ చిత్రం “సైంధవ్” కూడా ఒకటి. ఇది వెంకీ మామ కెరీర్ లో 75వ సినిమాగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా ఈ సినిమా కోసం ఇప్పుడు ఫ్యాన్స్ సహా ఆడియెన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అంటే అసలు దర్శకుడులో కానీ ఇతర చిత్ర యూనిట్ లో కానీ ఎలాంటి టెన్షన్ కనిపించడం లేదు. కాగా తాజాగా మేకర్స్ ఇచ్చిన ప్రమోషన్స్ సైంధవ్ క్లైమాక్స్ కోసం చాలా ఆసక్తిగా చెప్తున్నారు. తమిళ నటుడు ఆర్య అయితే తనకి ఇప్పుడు కూడా ఆ క్లైమాక్స్ కోసం తలచుకున్నా కూడా గూస్ బంప్స్ వస్తాయని ఆ రేంజ్ లో క్లైమాక్స్ ఉంటుంది అని తెలిపాడు.

అలాగే యంగ్ దర్శకుడు శైలేష్ కూడా ఈ క్లైమాక్స్ పార్ట్ పై మాట్లాడాడు. జెనరల్ గా ఒక సీక్వెన్స్ నుంచి సినిమా పుడుతుంది అలాగే నేను కూడా సైంధవ్ సినిమాని స్టార్ట్ చేసిందే ఆ క్లైమాక్స్ సీన్ నుంచి అని అక్కడ నుంచే ఈ సినిమా పుట్టింది అని అతను తెలిపాడు. దీనితో సైంధవ్ క్లైమాక్స్ మాత్రం సినిమాలో గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా అయితే ఈ జనవరి 13న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.