‎Venkatesh: యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్న వెంకీ మామ.. మూవీస్ లైనప్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో వెంకటేష్ కూడా ఒకరు. ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నారు వెంకీ మామ. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వెంకీమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

‎ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట వెంకీ మామ. ఈ విషయంలో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు.

‎ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లో తన వాయిస్ తో మ్యాజిక్ చేశాడు వెంకటేష్. ఈ సినిమా తరువాత వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అలాగే త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో వస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్ ఫంఛైజీ దృశ్యం 3 మూవీని మొదలు పెట్టనున్నాడు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుంది. ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా గెస్ట్ గా చేయనున్న వెంకటేష్. మరో ఇద్దరు కుర్ర దర్శకులకు కూడా అవకాశం ఇచ్చాడట. అయితే ఇలా ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తున్న వెంకీ మామ ని చూసి యంగ్ హీరోలు సైతం షాక్ ఆశ్చర్యపోతున్నారు.