గాసిప్స్ : ఓటిటిలో “సైంధవ్” వచ్చేస్తున్నాడా?

తెలుగు సీనియర్ హీరోస్ లో ఇప్పుడు దాదాపు అంతా కూడా ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా పలు చిత్రాలు చేస్తున్నారు. అయితే అందరికీ ఎంతో ఇష్టమైన బిగ్ స్టార్ విక్టరీ వెంకటేష్ చేసిన “సైంధవ్” అనే సినిమాకి మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సినిమా టీజర్ ట్రైలర్ లాంటివి చూసాక ఇది వెంకీ మామ వెర్షన్ విక్రమ్ చిత్రం అవుతుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ అనుకోని విధంగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చాక అంచనాలు అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. అయితే ఇది వెంకీ మామ కెరీర్ లో 75వ సినిమా కావడంతో తాను కూడా ఎప్పుడు లేని విధంగా చాలా ఎక్కువ శాతం ప్రమోషన్స్ ని బయట చేశారు అయినా ఫలితం లేకపోయింది.

కాగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లోనే ఓటిటిలో వచ్చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ లాక్ చేసుకోగా అందులో ఈ సినిమా ఈ ఫిబ్రవరి మొదటి వారం లోనే వచ్చేస్తుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు ఆర్య, ఆండ్రియా జెరెమియాలు కూడా నటించారు. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్కీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ విలన్ పాత్రతో తెలుగు సినిమాకి పరిచయం అయ్యాడు.