రాజ‌మౌళి హీరోయిన్‌తో సంపూ కొత్త సినిమా

హృదయకాలేయం మూవీతో సెన్సేషనల్ స్టార్ అయిపోయారు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమాకు గానూ సినీ’మా’ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్ అవార్డు కూడా అందుకున్నాడు సంపూ. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా పార్టిసిపేట్ చేసాడు. అంతేకాదు కరెంటు తీగ, బందిపోటు లాంటి సినిమాల్లో క్యామియో రోల్స్ లో నటించాడు. సంపూ హీరోగా రెండేళ్ల క్రితం సెట్స్ పైకి వెళ్లిన ‘కొబ్బరిమట్ట’ సినిమా ఏవో కారణాల వల్ల కంప్లీట్ అవలేదు. ఈ ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సెన్సేషనల్ స్టార్ హీరోగా ఒక కొత్త సినిమా మొదలవబోతుందని ఫిలిం నగర్ న్యూస్.

ఈ సినిమాలో రాజమౌళి హీరోయిన్ నటించబోతుందని వినికిడి. రాజమౌళి హీరోయిన్ అనగానే ఏ కాజలో, అనుష్కనే అనుకోకండి. మర్యాదరామన్న హీరోయిన్ సలోని గుర్తుందా? హా..ఆ భామతోనే సంపూ జత కట్టబోతున్నాడట. మర్యాదరామన్న మంచి హిట్ అయినప్పటికీ ఆశించదగ్గ ఆఫర్లు రాలేదు సలోనికి. ఏవో ఒకటి రెండు సినిమాలు వచ్చినా వాటి వలన గుర్తింపు రాలేదు. మరి సంపూతో చేసే సినిమా ద్వారా అయినా లక్ కలిసొస్తుందేమో చూడాలి.