ఇది వూర మాస్ కూర !  : పందెం కోడి-2 (మూవీ రివ్యూ)

(సికిందర్ )


‘పందెం కోడి -2’ 
రచన – దర్శకత్వం : 
ఎన్‌.లింగుస్వామి
తారాగణం : 
విశాల్కీర్తిసురేశ్క్ష్మీ త్కుమార్రాజ్కిరణ్ దితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : కేఏ క్తివేల్
బ్యానర్స్‌: లైట్హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్ఎల్పివిశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీలైకా ప్రొడక్షన్స్పెన్‌ స్టూడియోస్
ర్ప‌: ఠాగూర్ ధు
నిర్మాతలు: విశాల్దవళ్‌ జయంతిలాల్‌ గడాఅక్షయ్‌ జయంతిలాల్‌ గడా
విడుదల : అక్టోబర్ 18, 2018


రేటింగ్  2.75 / 5 

2005 లో విశాల్ నటించి హిట్టయిన పందెం ‘కోడి డబ్బింగ్’ కి మరో సీక్వెల్ డబ్బింగ్ ‘పందెం కోడి -2’. తమిళ మూస మాస్ సినిమాల దర్శకుడు లింగుస్వామి తన ప్రతిభని కొంచెం డిఫరెంట్ గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ జాతర సినిమాగా తీశాడు. వరసగా ‘డిటెక్టివ్’, ‘అభిమన్యుడు’ హిట్స్ తో హుషారుగా వున్న విశాల్ దీనికి తనే నిర్మాతయ్యాడు. మరి ఈ సీక్వెల్ కాని సీక్వెల్ ఎలా వుంది?

కథ 

          ఏడు ఊళ్ళు కలిసి ఉమ్మడి శ్రేయస్సు కోసం ప్రతీ యేటా జాతర జరుపుకునే సాంప్రదాయాన్ని పాటిస్తూంటాయి. ఏడేళ్ళ క్రితం జరిగిన జాతరలో భోజనాల దగ్గర గొడవ జరిగి నరుక్కుంటారు. ఈ నరికివేతలో భవానీ (వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌) భర్త చనిపోతాడు. దీంతో ఆమె నరికినవాడి వంశంలో అందర్నీ చంపించేస్తుంది – ఒకడు తప్పించుకుంటాడు. ఈ తప్పించుకున్న గోపీ అనే వాణ్ణి ఏడూళ్ళ  పెద్ద రాజారెడ్డి (రాజ్ కిరణ్) కాపాడి ఐఏఎస్ చదివిస్తూంటాడు. మళ్ళీ జాతర నాడే వాణ్ణి చంపాలని నిర్ణయించుకుంటుంది భవానీ. దీంతో జాతర వాయిదాలు పడుతూ ఊళ్ళు కరువు కాటకాలతో అలమటిస్తూంటాయి. ఏడేళ్ళ తర్వాత రాజారెడ్డి ఎలాగో రాజీ కుదిర్చి జాతర జరిపిస్తాడు. ఈ జాతరకి విదేశాల్లో చదువుకుంటున్నరాజారెడ్డి కొడుకు బాలు (విశాల్) వస్తాడు. ఇతను జాతరలో చారుమతి (కీర్తీ సురేష్) అనే అల్లరి పిల్లకి ఎట్రాక్ట్ అవుతాడు. జాతరలో భవానీ మాటతప్పి గోపీని టార్గెట్ చేస్తుంది. బాలు కాపాడి విషయం తెలుసుకుంటాడు. దీంతో ఏడు రోజులూ జరిగే జాతరలో గోపీని కాపాడే బాధ్యతని తండ్రితో కలిసి బాలూ తీసుకుంటాడు. ఈ నేపధ్యంలో జరిగిన ఇంకో దాడిలో తండ్రి గాయపడేసరికి, బాలూ భవానీ అంతుచూసేందుకు కదనరంగంలోకి దూకుతాడు…

ఎలావుంది కథ 


          కథకి కౌబాయ్ కథా లక్షణముంది. ఇది గుర్తించి వుంటే బాధితుణ్ణి కాపాడేందుకు తండ్రీ కొడుకుల గుర్రాలులేని కౌబాయ్ టైపు యాక్షన్ అడ్వెంచర్ గా ఈ కథ కొత్త మెరపులు మెరిపించేది. పూర్తి  సినిమా జాతర నేపధ్యంలో, గ్రామీణ వాతావరణంతో, వూర మాస్ జనసందోహంతో నిండిపోయి వున్నప్పుడు –  ఇదంతా కౌబాయ్ టైపు కథాకథనాల సరళి లోకి మార్చి వుంటే, ఒక అద్భుత కమర్షియల్ ప్రయోగం ప్రేక్షకుల ముందు కొచ్చేది. 2015 లో విశాల్ నటించిన ‘రాయుడు’ ఎలా మార్పులేని వూర మాస్ వాతావరణంతో, లుంగీ మార్కు డార్క్ పాత్రలతో విజువల్ గా వికర్షిస్తుందో, ఇదీ ఆ ధోరణిలోనే విజువల్ అప్పీల్ లేని, రిలీఫ్ నివ్వని, పచ్చి దృశ్యాలతో వుంటుంది. తండ్రీ కొడుకులు ఒకణ్ణి చావకుండా కాపాడ్డమనే సెంట్రల్ పాయింటు,  రొటీన్ గా వచ్చే ఇలాటి ఫ్యాక్షన్ జానర్ కథలకి భిన్నమైనది. దీన్ని ఫ్యాక్షన్ జానర్ పద్ధతిలోనే చూపిస్తూ, తెలుగు డబ్బింగ్ కి రాయలసీమ ప్రాంతమని చెప్పడంతోనే పాయింటు నావెల్టీని కోల్పోయింది. వూర మాస్ కథగా మిగిలింది. 

ఎవరెలా చేశారు 

          తమిళ టెంపర్ హీరో విశాల్ అదే యాక్షన్ హీరోగా అదే యాక్షన్ తో సరిపుచ్చాడు. యాక్షన్ సీన్స్ జాతరలోనే వుండడంవల్ల అన్నీ ఒకేలా వుంటాయి. యాక్షన్ తప్ప పాత్రకి వేరే లక్షణాలు, ఎమోషన్లు లేకపోవడం చేత మొనాటనీతో సాగిపోతూ వుంటాడు. తెగ అల్లరి హీరోయిన్ తో రోమాన్స్ లో మర్యాద రామన్నలా వుంటాడు. సెకెండాఫ్ లో మైండ్ గేమ్స్ అనే అరిగిపోయిన డ్రామా వల్ల హీరోయిజం కొత్తదనాన్ని కోల్పోయి మరీ బోరు కొడుతుంది. కానీ నిర్మాతగా ఖర్చుకి వెనుకాడకుండా ఇంత భారీ జాతర సినిమా నిర్మించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఈ సక్సెస్ తమిళం వరకే పరిమితమవ్వొచ్చు. 

          తెలుగు ప్రేక్షకులకి తాజాగా ‘మహానటి’ లో కన్పించిన హీరోయిన్ కీర్తీ సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాస్ కి ఇంతగా దగ్గరయ్యే  వూర మాస్ పాత్రని ఒంటి చేత్తో, ఎంతో ఈజ్ తో నటించి పారేసింది – పాత సినిమాల్లో ఇలాటి పల్లెటూరి పాత్రలు వేసిన అప్పటి హీరోయిన్లని గుర్తుకు తెస్తూ. సినిమాలో కామెడీ లేని లోటు తనే తీర్చింది. దర్శకుడు లింగు స్వామి ఈమెని ఏ క్షణంలో  ఎలా సర్ ప్రైజ్ చేసి చూపిస్తాడో వూహకందని విధంగా వుంటుంది. ఇటీవలి కాలంలో ఒక సక్సెస్ ఫుల్ మాస్ హీరోయిన్ పాత్ర ఇది – కీర్తి సురేష్ నటిస్తూ.  

          ఇంకోముఖ్య పాత్రలో తండ్రి పాత్ర వేసిన రాజ్ కిరణ్ యాక్షన్ సీన్స్ కూడా చేస్తాడు. విలన్ గా వేసిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ తన కౄర పాత్రని  నిలబెట్టేందుకు ప్రయత్నించింది గానీ, ప్రేక్షకుల్లో తనకి గుర్తింపు లేకపోవడం చేత వృధా శ్రమయింది. రమ్య కృష్ణ, నయనతార, ఆఖరికి ‘నీవెవరో’  విలన్ తాప్సీ లాంటి పాపులర్ నటి ఎవరైనా వుంటే  అది సినిమాకే ప్లస్ అయ్యేది.

          యువన్ శంకర్ రాజా సంగీతంలో పాటలన్నీ జాతరలోనే వుండడం చేత అన్నీ ఒకేలా అన్పిస్తాయి. శక్తివేల్ కెమెరా,  ఐదు నిమిషాలకో ఫైట్ అందించిన అనళ్ అరసు యాక్షన్ కోరియోగ్రఫీ కూడా జాతర దృశ్యాలతో విజువల్ రిలీఫ్ లేమినీ భరిస్తాయి.

 

చివరికేమిటి 

          దర్శకుడు లింగు స్వామి సినిమా సాంతం జాతర నేపధ్యంలో నడిచే మేకింగ్ కి పూనుకుని సాహసమే చేశాడు.  వెండితెరకి ఇదొక్కటే కొత్త ప్రయోగం కావొచ్చు. కథలో పాయింటు కూడా కొత్తదే. దీనికి తెలుగులో చెప్పుకోవాలంటే ఫ్యాక్షన్ యాక్షన్ గా చూపడంతో కొత్త సీసాలో పాతసారాలాగా తేలింది.  అయితే ఫస్టాఫ్ పట్టు సడలని బిగితో, వేగంతో, పాయింటు నుంచి పక్కకు  తొలగకుండా, రోమాన్స్ తప్ప వేరే సబ్ ప్లాట్స్ జోలికి పోకుండా, ఏకత్రాటిపై ఏకసూత్రతతో కథని నడిపిన విధానం మాత్రం బావుంది. ఇది సెకండాఫ్ కొచ్చేసరికి మైండ్ గేమ్స్ అనే ఇంకో అరిగిపోయిన ఫార్ములా బారిన పడి బలహీనంగా మారింది. ఎప్పుడో 2003 లో వచ్చిన విక్రం హిట్ ‘సామి’కి,  పదిహేనేళ్ళ తర్వాత సీక్వెల్ అంటూ తీరిగ్గా గతనెల ‘సామి -2’ వచ్చినట్టు – 2005 లో విశాల్ తో హిట్టయిన ‘పందెం కోడి’ కి ఇప్పుడు పదమూడేళ్ళ తర్వాత బద్ధకంగా సీక్వెల్ అంటూ ‘పందెం కోడి -2’ వదలడం చోద్యమే. సీక్వెల్ కి ఎక్కడైనా మహా అంటే ఐదేళ్లకంటే గ్యాప్ తీసుకోరు. తమిళ జాతికి  పది పదిహేనేళ్ళు  కావాలేమో. ‘పందెం కోడి -2’ మాస్ ప్రేక్షకులకి సరైన దసరా వినోదమనొచ్చు.