Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. తెలుగువాడైన విశాల్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడిగా కొనసాగుతున్న హీరో విశాల్ తరచూ ఏదో ఒక వార్తల ద్వారా వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక విషయంలో వార్తలో నిలిచే ఈయన పెళ్లి గురించి కూడా ఎన్నో సందర్భాలలో వార్తల్లో నిలిచారు. ఈయన ఎంతమంది హీరోయిన్ లతో ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్ వరలక్ష్మి, అభినయ వంటి హీరోయిన్లు పెళ్లి చేసుకోవడంతో ఈ రూమర్లకు తెర పడింది.
ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నటువంటి విశాల్ ఇకపై పెళ్లి చేసుకోరని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి తరుణంలోనే పెళ్లి గురించి మాట్లాడుతూ విశాల్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. త్వరలోనే తాను ఓ ఇంటి వాడు కాబోతున్నాను అంటూ స్వయంగా విశాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తదితర పెద్దల సమక్షంలో శపథం చేశారు. మరో రెండు మూడు నెలలలో ఈ భవనం నిర్మాణం పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొన్ని నెలలుగా నా ప్రేమాయణం సాగుతోందని, నా ప్రియురాలు ఎవరో త్వరలోనే చెబుతానని ఆగస్ట్ 29న నా పుట్టినరోజు కాబట్టి ఆరోజు పెళ్లి గురించి ప్రకటిస్తానని విశాల్ చెప్పడంతో కోలీవుడ్ షాకైంది. దీంతో ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.