ప్రభుత్వ నిర్లక్ష్యంతో తల్లికి కడుపు కోత (వీడియో)

సంగారెడ్డి జిల్లాలో నీటి కాలుష్యానికి ఓ పసిపాప బలైంది. పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన ఓ గర్బిణి ఏప్రిల్ 28న ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాపకు అనారోగ్యం చేయడంతో నీలోఫర్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియాకు కూడా తీసుకెళ్లి చికిత్స చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. పాప పుట్టినప్పుడే చాలా బలహీనంగా పుట్టింది. నీటి కాలుష్యం వలన బిడ్డ ఎదుగుదల సరిగా కాలేదని పాప పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం అని డాక్టర్లు చెప్పారు. రెండు నెలల తర్వాత ఈ రోజు ఉదయం పాప వాంతులు చేసుకుని మరణించింది. దీంతో ఆ కన్నతల్లి కడుపుకోతతో గుండెలవిసేలా రోధించింది.
కాలుష్యపు కంపెనీలను పట్టణానికి దూరంగా స్థాపించాలన్న నిబంధనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల వలన విపరీతమైన కాలుష్యం వస్తుదని చెప్పినా ప్రభుత్వానికి చెవికి ఎక్కటం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఒక తల్లి తన బిడ్డను కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.