అజారుద్దీన్, సికిందరాబాద్ లో కాలు పెడితే కాటేస్తా!!!

ఇందిరభవన్ లో 16 జులై 2018 : కాంగ్రెస్ లో మామూలుగానే కుమ్ములాట సర్వసాాధారణం. కుమ్ములాట లేకుండా కాంగ్రెస్ సమావేశాలు జరిగితేనే వింత. ఈరోజు   హైదరాబాద్ నగర  కాంగ్రెస్ సమావేశంలో చిత్రమయిన గొడవ జరిగింది. దీనితో  హైద్రాబాద్ నగర కాంగ్రెస్ సమావేశం రసాభాస అయింది.  ఈ సమావేశంలో సికిందరాబాద్ మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ చాలా   ఏమోషనల్ అయిపోయారు. దీనికి కారణం, మాజీ క్రికెటర్  అజారుద్దీన్ అంజన్ కోటలో కాలు పెట్టాలనుకోవడమే.

అజారుద్దీన్ సవాయ్ మాధోపూర్ (రాజస్తాన్) నుంచి లోక్ సభ కు 2014 లో పోటీ చేసి ఓడిపోయారు.  అంతకు ముందుకాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్ నుంచి పోటీచేయించి ఎంపి చేసింది. అయితే, రెండో ప్రయత్నం రాజస్థాన్ లో విఫలమయింది.  దీనితో, తెలంగాణ విభజన తర్వాత కళావిహీనంగా ఉన్న  కాంగ్రెస్ లోకి ఈ మాజీ క్రికెట్ స్టార్ వస్తే కళ వస్తుందని ఆయన తెలంగాణ కుతెచ్చుకున్నారు.

ఎందుకు?

కాంగ్రెస్ ను డిచ్ చేసి, టఆర్ ఎస్ త్ చేతులు కలిపిన  ఎంఐఎం  అసదుద్డీన్ ఒవైసీ మీద పోటీచేయించి ఓడించి, ఎంఐఎంకు, టిఆర్ ఎస్ కు గుణ పాఠం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ఆశించారు. హైదరాబాద్ లోక్ సభకు అజార్ క్యాండిడేట్ అనే టాక్ వచ్చింది.

 

అయితే, వొవైసీ మీద పోటీ చేసి గెలుస్తామన్న నమ్మకం అజార్ కు లేదు. లేక ఇంకేమయినా రాజకీయమో ఏమో అజార్ ఉన్నట్లుండి హూదరాబాద్ ను వదిలేసి సికిందరాబాద్ బాగుంటుందని ప్రకటించారు.దీని ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే అది బెడిసి కొట్టింది.

తాను యన హైదరాబాద్ నుంచి మారి సికిందరాబాద్ లోక్ సభకు రావాలనుకున్నట్లు చెప్పేశారు. ఇలాంటి నిర్ణయం పార్టీ  తీసుకోవాలి. అయితే, తనో స్టార్ కాబట్టి, తనే నిర్ణయం తీసుకుని  నిన్న ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ సికిందరాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీలో అభిప్రాయాలు కాకుండా, తన అభిమానులు,  మిత్రులు తాను సికిందరాబాద్  నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. మరి అంజన్ కుమార్ యాదవ్ ఏంకావాలి.

అంజన్ అంతెత్తు ఎగిరిపడ్డారు. అదే ఈ రోజు గ్రేటర్ హైదరాాబాద్ కాంగ్రెస్ సమావేశంలో గొడవకు కారణం.అంజన్ కుమార్ అజారుద్డీన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.తన సీటుకు అజార్ ఎసరు పెట్టాలనుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

‘అజారుద్దీన్ కు శక్తి సామర్ధ్యాలు ఉంటే హైద్రాబాద్ పార్లమెంటు నుండీ పోటీ చేయాలి, గెలిచాలి. అంతేగాని, ఇలా సేఫ్ గా ఉండే సికిందరాబాద్ నుంచి పోటీ చేయాలనుకోవడం ఏమిటి?,’అని ఆయన ప్రశ్నించారు. అలాంటిపప్పులుడకవు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంజన్ పార్లమెంటును వదలడని ప్రకటించారు.

అజారుద్దీన్ వ్యాఖ్యల మీద చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి సరవ్ేవ సత్యనారాయణ కూడా సికిందరాబాద్ లోక్ సభ అంజన్ కుమార్ యాదవ్ దే అని ప్రకటించారు.దీనితో సమావేశంలో ఉన్నవారంతా అంజన్ కుమార్ కుమద్దతుగానినాదాలు చేశారు. అయితే,అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతుంటే మీటింగ్ లో నుండి  వి .హనుమంతరావు వెళ్లిపోయారు.

నగర కాంగ్రెస్ మీటింగ్ కు త్వరలో పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి  ముఖేష్ గౌడ్వి ఆయన కుమారుడు క్రమ్ గౌడ్ హ జరు కాలేదు.