ప్రస్తుత కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ కొంతమంది బాబాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ప్రజలు కూడా బాబాలను నమ్మి ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది దొంగ బాబాలు మహిళలను టార్గెట్ చేస్తూ వారిని నగ్నంగా ఫోటోలు వీడియోలు తీస్తూ మహిళలను బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు రాబడుతున్నారు. అంతేకాకుండా పేదరికంలో ఉన్న మహిళలకు డబ్బు ఆశ చూపించి వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. తాజాగా ఎటువంటి సంఘటన హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ హుస్సేన్ అనే దొంగ బాబా పేదరికంలో ఉన్న మహిళల కష్టాలు తీర్చే శక్తి తనకుందని అందరినీ నమ్మబలుకుతూ.. వారి నిస్సహాయతని ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.
ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. గతంలో సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడని.. కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్ అతని స్వస్థలం అని కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్ విచారణలో వెల్లడించాడు.
గులాం ఆదేశాల మేరకు వారం క్రితం పాతబస్తీ కి చేరుకున్న హుస్సేన్ బార్కస్ లో ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ క్రమంలో పేద మహిళలను టార్గెట్ చేసి వారికి మాయమాటలు చెప్పి తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు నగ్నంగా ఫొటోలు తీశాడని పోలీసులు వెల్లడించారు. మహిళల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళలను నగ్నంగా ఫోటోలు తీసాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు గురించీ పూర్తీ వివరాలు తొందర్లోనే వెల్లడిస్తామని పోలీసులు వివరించారు.