ప్రగతి సభ ఎఫెక్ట్.. టిఎస్‌పీఎస్సీ మరో నిర్ణయం

నిరుద్యోగులకు టిఎస్‌పీఎస్పీ షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏఎస్వో, మండల ప్లానింగ్ ఆఫీసర్ల పరీక్షను ఆదివారం నిర్వహించాల్సి ఉండేను. కానీ టిఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ ఉండటంతో అభ్యర్థులకు ఇబ్బంది అని భావించి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై అభ్యర్థుల నుంచి విమర్శలు వచ్చాయి. రాఖీ పండగ రోజు ఎస్సై పరీక్ష నిర్వహిస్తే తప్పులేనిది సభ కోసం వాయిదా వేస్తారా అంటూ విమర్శలు వచ్చాయి.

దీంతో టిఎస్ పీఎస్సీ పరీక్ష తేదిని సెప్టెంబర్ 3 అని ప్రకటించింది. అది కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షను 11 గంటలకు వాయిదా వేసింది. టిఆర్ ఎస్ సభ రాత్రి వరకు సాగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ ఉదయం వరకు ఉంటుంది కావున అభ్యర్థుల సౌకర్యార్ధం గంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభిస్తున్నామని టిఎస్ పీఎస్సీ తెలిపింది. 7 జిల్లాల్లో 154 పరీక్ష కేంద్రాల్లో 92,600 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకానున్నారు.