టిఆర్ఎస్ సునీత డౌన్ డౌన్ అన్నారు (వీడియో)

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాజపేట మండలంలోని చల్లూరు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన గొంగిడి సునీతను గ్రామస్థులు అడ్డుకొని సునీత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సునీతను అడ్డుకొని నినాదాలు చేసిన వీడియో కింద ఉంది చూడండి. 

 

GONGIDI SUNITHA CAMPAIN

ఆలేరు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా గొంగిడి సునీత మళ్లీ పోటి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సునీత చల్లూరుకు చేరుకున్నారు. సునీత రాకను తెలుసుకున్న గ్రామస్థులు సునీత గోబ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సునీత ప్రచారాన్ని అడ్డుకున్నారు. 5 ఏళ్లలో ఏనాడు రానీ సునీతకు తమ ఓటును అడిగే హక్కు లేదని గ్రామస్థులు మండిపడ్డారు. అభివృద్ది లేక గ్రామం నాశనమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.