తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ జన్మదినం రేపు (మంగళవారం). దీంతో కేటిఆర్ మీద అభిమానంతో ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు రకరకాల పద్ధతుల్లో కేటిఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. కొందరు అభిమాన నాయకుడు కాబట్టి తమకు తోచిన పద్ధతుల్లో బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. ఇంకొందరు తమ నాయకుడి కంట పడేందుకు సెలబ్రేషన్స్ చేస్తారు. కొందరు కేటిఆర్ బర్త్ డే కదా దీన్ని కమర్షియల్ గా వాడుకుందామనుకుని సెలబ్రేట్ చేస్తారు.
కానీ కేటిఆర్ మాత్రం తన బర్త్ డే గురించి స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేశారు. దాని సారాంశమేమంటే.. తన బర్త్ డే పేరుతో ఫ్లెక్సీలు కట్టొద్దని, పూల బొకేలు తీసుకోవద్దని గట్టి సందేశమే పంపారు. అంతేకాదు ఇప్పటికే ఎవరైనా ఫ్లెక్సీలు కట్టి ఉంటే వాటిని తక్షణమే ఊడబీకేయాలని కూడా మేయర్ బొంతు రామ్మోహన్ కు ఆదేశాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సోమవారం మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఎక్కడెక్కడైతే కేటిఆర్ బర్త్ డే ఫ్లెక్సీలు ఉన్నాయో వాటన్నింటినీ దగ్గరుండి చింపేయించారు. ఒక కొత్త టివి చానెల్ వారు హైదరాబాద్ నగరంలో తెగ ఫ్లెక్సీలు పెట్టేశారు. వాటన్నిటినీ రామ్మోహన్ పీకేయించారు. ఆ ఫొటోలు కింద ఉన్నాయి. చూడండి.
https://telugurajyam.com/ktr-asks-ghmc-mayor-to-clear-all-flex-boards-of-birthday-greetings/
కేటిఆర్ బర్త్ డే స్పెషల్ సాంగ్..
కేటిఆర్ బర్త్ డే సందర్భంగా 712 మంది టిఆర్ఎస్ కార్యకర్తలతో కేటిఆర్ బొమ్మ ప్రతిబింబించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు, కేటిఆర్ అభిమానులు ఆ వీడియోను బాగా షేర్ చేస్తున్నారు. వీడియో కింద ఉంది చూడండి.
