భారత దేశ ఉప ప్రధానిగా కేసీఆర్ కి పదవి ?

తెలుగు రాజకీయ నాయకుల్లో చెప్పుకొద్ద నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలుగు ప్రజలు అప్పుడే మరిచిపోలేరు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికలలో ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పట్టారు. అలాగే 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కు మద్దతు ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు.
KCR special plan to for his third front
రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విశ్లేషణలకు అద్దం పడుతూ 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడో కూటమిని ఏర్పాటు చేయడానికి పలు రాష్ట్రాల నేతలను కూడా కేసీఆర్ కలిశారు.

కేసీఆర్ కూడా రాష్ట్ర భాధ్యతను కొడుకు కేటీఆర్ కు అప్పగించి జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉండబోతున్నారని సమాచారం. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లబోతున్నారని తాజాగా బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో వేలు పెట్టాలనుకుంటున్నారని, కేంద్రంలో ఉప ప్రధాని పదవి కోసం ప్రయత్నిస్తున్నారని, దీని కోసం ఆంధ్రప్రదేశ్ ఏపీల సహాయంతో తీసుకుంటున్నారని బాంబ్ పేల్చారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుడే ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. కేంద్రానికి ఒక ఉప ప్రధానిని నియమించే అవసరం లేకపోయినప్పటికీ బీజేపీ నేతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్ లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన మాటల పదును చూపిస్తారో లేదో వేచి చూడాలి.