రేవంత్ రెడ్డిపై కేటిఆర్ స్ట్రాంగ్ సెటైర్

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ మధ్య 500 కోట్ల డీల్ నడిచిందని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే 500 కోట్లకు ఆశపడి కాంగ్రెస్ పార్టీ బాబుకు దాసోహమైందని ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డిపైనా పరోక్షంగా చురకలు వేశారు9.  తెలంగాణ భవన్ లో హుజుర్ నగర్, చొప్పదండి నియోజక వర్గాల టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటిఆర్ వాడివేడి కామెంట్స్ చేశారు. ఆయనేమన్నారో కింద చదవండి.

2014 శాసన సభ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ ఆరు సీట్లు గెలిచాం. ఉద్యమం అప్పట్నుంచి టిఆర్ఎస్ నేతలు కష్టపడి పనిచేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో నల్లగొండ లో మహామహులు మట్టి కరిచారు. హుజుర్ నగర్ లో ట్రక్కు గుర్తు, టక్కు టమార విద్యల వల్ల ఉత్తమ్ గెలిచారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, మోడీ, చివరకు ఆరోగ్యం బాగా లేకున్నా సోనియా తెలంగాణ లో ప్రచారం చేసినా టిఆర్ఎస్ ను ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు.

చంద్రబాబు ఇచ్చిన 500 కోట్ల రూపాయల కు ఆశపడి కాంగ్రెస్ టీడీపీ కి దాసోహమంది. తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తి ని ప్రదర్శించి టిఆర్ఎస్ ను, కెసిఆర్ ను అక్కున చేర్చుకున్నారు. బీజేపీ కి వంద సీట్ల లో డిపాజిట్లు కోల్పోయింది. సింహం సింగిల్ గా వస్తుందన్నట్టు కెసిఆర్ సింగిల్ గా వచ్చి గెలిచారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతల బుర్రలు పాడయ్యాయి. పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ ఎన్నికలు పెట్టమని డిమాండ్ చేస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. ఓటర్లు ఇచ్చిన తీర్పు కు కాంగ్రెస్ నేతలు కొంతమంది రిటైర్ మెంట్ తీసుకున్నారు. మరికొంత మంది మీడియా కు కూడా దూరమయ్యారు (రేవంత్ రెడ్డిని ఉద్దేశించి). కాంగ్రెస్ నేతలు ఇప్పట్లో లేచే పరిస్థితి లేదు. 

ఓడిన చోటనే వెతుక్కోవాలన్నట్టుగా హుజూర్ నగర్ కార్యకర్తలు పనిచేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతటి అహంకారి మరొకరు లేరు. ట్రక్కు గుర్తుతో కలిపి టిఆర్ఎస్ కు 50 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల కోసం బూత్ స్థాయి కమిటీ లు పటిష్టం చేసుకోవాలి. పది ఇండ్లకో కార్యకర్త ను నియమించుకోవాలి, వంద మంది కో కార్యకర్త ఉండాలి. సిరిసిల్ల లో పటిష్టమయిన బూత్ కమిటీ లతోనే నా మెజారిటీ పెరిగిoది. 

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదు. పంచాయతి ఎన్నికల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు సమష్టి గా పని చేసి వీలయినన్ని ఏకగ్రీవం చేసుకోవాలి. 3400కు పైగా తాండాలను గ్రామ పంచాయతీ లుగా చేసిన ఘనత కెసిఆర్ దే. తాండాల్లో చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండే పరిస్థితి ఉంది. పార్టీ ని పటిష్టంగా మార్చి పార్లమెంటు ఎన్నికలలోనూ మంచి ఫలితాలు సాధించాలి.

కెసిఆర్ చొప్పదండి అల్లుడు…అన్ని విధాల నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ నేతలు అధికారం వస్తుంది అని కలలు గని మంత్రి పదవులు సైతం పంచుకున్నారు. నిశ్శబ్ద విప్లవం అని ఉత్తమ్ అంటే శబ్ద విప్లవం అని నేనన్న. తెలంగాణ ప్రజలు శబ్ద విప్లవం అంటే ఏమిటో చూపించారు. అధికారం వచ్చిందనే గర్వం కార్యకార్తలకు పనికి రాదు. ప్రజల తోనే మమేకం కావాలి.