కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ మహిళా ఎజెండా మామూలుగా లేదుగా

తెలంగాణలో ఘనవిజయం సొంతం చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత జాతీయ రాజకీయాల్లో కూడా తెలంగాణ ఫార్ములా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేసిఆర్ ఆలోచన ఏమిటో కేటిఆర్ వివరించారు. రేపటి ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో మహిళా రిజర్వేషన్లు ఎలా ఇవ్వవచ్చో కేటిఆర్ మదిలో ఏముందో కేటిఆర్ సూత్రప్రాయంగా చెప్పారు. మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కేటిఆర్ మాటలు.. యదాతదంగా చదవండి.

మీట్ ది ప్రెస్ లో మట్లాడుతున్న కేటిఆర్

డిసెంబర్ 11 న టిఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే ప్రెస్ క్లబ్ కు మీట్ ది ప్రెస్ కు వస్తానన్నాను. వచ్చాను. చిరస్మరణీయ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శిరసు వహించి నమస్కరిస్తున్నాను. ఇది చారిత్రాత్మక విజయం .నేను బతికి ఉన్నంత వరకు గుర్తు పెట్టుకునే విజయం. తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఎంత బలం గా ఉన్నారో ఈ ఫలితాలు నిరూపించాయి. కెసిఆర్ ఒక్కడు ఒక్క వైపు మిగతా రాజకీయ పార్టీ ల నేతలు మిగతా వైపు అన్నట్టు ఎన్నికలు సాగాయి. 

దాదాపు గా 2 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటే 98 లక్షల ఓట్లు మా పార్టీకి వచ్చాయి. ద్వితీయ స్థానం లో కాంగ్రెస్ కు మాకు 48 లక్షల ఓట్ల తేడా ఉంది. మాకు 47 శాతం ఓట్లు వచ్చాయి ..అందుకే ఇది అసాధారణ విజయం. నేను ముందుగా చెప్పినట్టే బీజేపీ కి వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. నిశ్శబ్ద విప్లవం కాదు శబ్ద విప్లవమే అని చెప్పాను అలానే జరిగింది. ప్రజలకు, టిఆర్ఎస్ కు ఉన్న విడదీయరాని బంధమే ఈ అద్భుత విజయానికి కారణం.

మహిళలకు పార్టీ కమిటీ ల్లో తప్పని సరిగా ప్రాధాన్యత నిస్తాం. మేము కంగారు పెట్టే వాళ్ళమే తప్ప  కంగారు పడే వాళ్ళం కాదు. లగడపాటి కి రాజకీయ సన్యాసం చేయించాం …ఇపుడు సర్వే సన్యాసం కూడా చేయించాం. ప్రభుత్వం వాగ్ధానాలు సరిగా అమలు చేసేలా  టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కృషి చేస్తా. హైదరాబాద్ అభివృద్ధి కి టిఆర్ఎస్ మేనిఫెస్టో లో పెట్టినవన్నీ చేస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని భారీ గా పెంచుకుంటోంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజెర్వేషన్లు కల్పించాల్సిందే. అవసరమయితే పార్లమెంటు సీట్లు పెంచి అయినా మహిళలకు రిజెర్వేషన్లు ఇవ్వాల్సిందే అనేది కెసిఆర్ అభిప్రాయం.  

పన్నెండు యేళ్ళ క్రితం టిఆర్ఎస్ లో చేరిన నాపై గురుతర బాధ్యత అప్పగించిన కెసిఆర్ కు పాదాభివందనం. పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వందేళ్ల పాటు పార్టీ పటిష్టంగా ఉండే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. 75 శాతం సీట్లు అందించి ప్రజలు మా పై గురుతర బాధ్యత మోపారు. దాన్ని ప్రభుత్వం, పార్టీ వమ్మ చేయదు. ఇటీవలి ఎన్నికల ఫలితాల తీరు ను బట్టి చూస్తే కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవనేది తేలిపోయింది. 16 ఎంపీ స్తానాల్లో టిఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ కేంద్రాన్ని శాసించే స్థితి లో ఉంటుంది. టిఆర్ఎస్ శ్రేణులు యుద్దాన్ని ఆపకుండా అనుకున్న గ మ్యo చేరుకునే దాకా పోరాటాలు చేయాలి.  ఇప్పటి పరిస్థితుల్లో 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీలో మనకుండే గౌరవం వేరే ఉంటుంది. 

కొన్ని మీడియా సంస్థలు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పని చేశాయి. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని మార్చగలం, దించగలం అని భావిస్తుంటాయి .ప్రజలు తలచు కుంటే తప్ప అది జరగదు. ఓటర్ల ను గందర గోళ పరిచే కుట్ర జరిగింది. లగడపాటి లాంటి వ్యక్తికి మీడియా విశేష ప్రాధాన్యమిచ్చింది. ఇకనైనా ఆ మీడియా సంస్థలు పునరాలోచన చేసుకోవాలి. ప్రతి పక్షాలు తాము సృష్టించుకున్న మాయా లోకం లో అవే పడ్డాయి. తెలంగాణ లో ఈవీఎం ల ట్యంపరింగ్ అని కాంగ్రెస్ చవకబారుగా విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎం ల ట్యంపరింగ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు నేను చొరవ తీసుకుంటా. వారసత్వం రాజకీయాల్లో ఓ ఎంట్రీ పాస్ లాగే పనికొస్తుంది. దేశం బలోపేతం కోసం మా ఫెడరల్ ఫ్రంట్ అయితే, తన సొంత పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు ఫ్రంట్. భారతదేశం కోసం మేము, తెలుగు దేశం పార్టీ కోసం చంద్రబాబు. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర పెద్దగా ఉండక పోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ లు కలిసినా ఎన్నికల తర్వాత కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. 

ప్రభుత్వం లో నేను ఉండాలా వద్దా అనేది పూర్తి గా సీఎం కు సంబంధిoచిన నిర్ణయం. సంకీర్ణ ప్రభుత్వాలు బాగా పని చేయవనేది అపోహ మాత్రమే. విద్యార్ధి రాజకీయాల నుంచి వచ్చిన వారికి పార్టీ లో సముచిత ప్రాధాన్యమిచింది. ఏపీ రాజకీయాల పై కూడా మాకు ఆసక్తి ఉంది. చంద్రబాబు పెద్ద నాయకుడు కాదు, గల్లీ నాయకుడు. .ఏపీ లో బలమయిన ప్రాంతీయ శక్తి గెలవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి తో పాటు సంక్షేమం మా జోడేడ్లు. తెలంగాణ అభివృద్ధి దేశానికి మోడల్ కావాలి. 

బుద్దుంది, బలం ఉంది, కావాల్సినంత టైం ఉంది. ఏపీ కి ఎప్పుడు వెళ్లాలనేది సరయిన సమయం లో నిర్ణయిస్తాం. ఏపీ కి ఏది కావాలో ఏపీ ప్రజలు నిర్ణయించుకుంటారు. చంద్రబాబు తో మాకు వ్యక్తిగతంగా గెట్టు పంచాయతీ లేదు. ఏపీ కి ఎవరయితే మంచిది అనేది మేము కచ్చితంగా చెబుతాం. కెసిఆర్ గారి నాయకత్వం తెలంగాణ కు మరో 10 15 ఏళ్ళు  అవసరం అని నాతో సహా టిఆర్ఎస్ శ్రేణులంతా కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో సీఎం గా ఉండి కూడా కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటారు. గతం లో సీఎం లు గా ఉండి కూడా జాతీయ రాజకీయాలు నడిపిన వారున్నారు.

తెలంగాణలో సీఎం సీటు ఖాళీగా లేదు. సీఎం పదవి పై నాకు ఆశ లేదు. మీడియా కు తెలంగాణ లో కావాల్సిన స్వేచ్ఛ ఉంది. .భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మీడియా కూడా తన పరిధిని దుర్వినియోగం చేయకూడదు. కెసిఆర్ ను ఎవరేది తిట్టినా ప్రచురించడం, ప్రసారం చేయడం మంచిదా ? రాహుల్ గాంధీ ని నేను ప్రచురించని భాషలో తిడితే కూడా మీడియా ప్రచురించ కూడదు. పిల్లలను కూడా చెడ గొట్టేలా మీడియా ప్రవర్తించ కూడదు