హెల్మెట్ ఏక్కడ సార్, ఫైన్ కట్టిన IAS అధికారి

ఇలా హైదరాబాద్ ఎంపి జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ అపుడపుడు చేస్తుంటారు. హైదరాబాద్ మాది అన్న ధీమా ఆయనలో కనబడుతుంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారవచ్చు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పాలించే పార్టీ మారవచ్చు. హైదరాబాద్ లో మాత్రం ఎపుడూ ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. ఆ పార్టీ కి ఉన్న ఏడు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేల సీట్లు కూడా మారవు. ఎందుకంటే, ఏ పార్టీ అయినా ఎంఐఎం తో మచ్చి చేసుకునే తీరాలి మైనారిటీ వోట్ల కోసం. అందువల్ల రాష్ట్రంలో అధికారంలోకి ఎవరొచ్చినా, పోయినా, హైదరాబాద్ నవాబ్ అసదుద్దీనే. ఆ ధీమా పార్టీ నేతల్లో అంటే అసద్, అక్బర్ మాటల్లో కనబడుతుంటుంది. ఆమధ్య పార్టీ ఎమ్మెల్యే, అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ దయాదాక్షిణ్యాలు అవసరమని అన్నారు.

మొన్నా మధ్య అసదుద్దీన్, మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ని వెనక కూర్చో బెట్టుకుని బుల్లెట్ మీద మీర్ అలం ట్యాంక్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇద్దరు బాధ్యతాయుతమయిన పదవుల్లో ఉన్నారు. ఒకరు చట్టాలు చేస్తారు.మరొక వాటిని అమలు చేస్తారు.  బుల్లెట్ మీద వెళ్తున్నపుడు ఇద్దరికి హెల్మెట్ లేదు. కనీసం అసదుద్దీనయినా హెల్మెట్ ధరించితీరాలి. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి. పార్లమెంటు సభ్యుడు.చట్టం చేసే వాడు.ఇలా వెళ్లడడం ఆయనకు ఇది మొదటిసారికాదు, మూడు నాలుగు నెలలకిందట ఆయన ఇదె బుల్లెట్ మీద ముఖ్యమంత్రి కెసియార్ నివాసానికి వచ్చారు. బుల్లెట్ మీద రావడం మంచి ప్రచారాన్నిచ్చింది ప్రతికల్లో.

హెల్మెట్  వేసుకుంటే వెళ్తున్నది పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ అని తెలియకపోవచ్చు. అపుడు ఇంత సంచలనం కలగదు. అందుకే టిపికల్ రాజకీయ నాయకుడిలాగా ప్రచారం కోసం ఆయన చట్టం ఉల్లంఘించారనిపిస్తుంది.

అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేస్తే  సోషల్ మీడియా వూరుకోదుగా, ప్రజాప్రతినిధి బుల్లెట్ మీద తిరుగడం బాగుందని ప్రశంసిస్తూనే హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నించంది. ఈ నిర్లక్ష్యాన్ని విమర్శించారు సోషల్  మీడియా సభ్యులు. 
దీనితో వెనక కూర్చున్న సీనియర్ ఆఫీసర్ అర్వింద్ కుమార్ ట్రాఫిక్ వారికి వాలంటరీగా ఫైన్ చెల్లించారు. అర్వింద్ కుమార్ డిసెంట్ ఆఫీసర్ గా పేరుంది. డెడికేషన్ తో పని చేస్తారని ఆయనతో పనిచేసిన సిబ్బంది చెబుతారు. ఆయన బుల్లెట్ మీద కూర్చనే టపుడే హెల్మెట్ గురించి అసద్ కు గుర్తు చేసి ఉండాల్సింది. దానికి తోడు ఆయన హెల్మెట్ ధరించనందుకు సాకు చెప్పారు.అది చాలా తక్కువ దూరమని, కారు వెళ్లలేని ప్రదేశమని అన్నారు. ఫోటో అలా లేదుగా. అయినా సరే అర్వింద్ కుమార్ నుంచి ఇలాంటి జస్టిఫికేషన్ ఆశించలేం. ట్విట్టర్ అనుచరులు దీనిని అంగీకరించలేదు. దుమ్మెత్తి పోశారు.

 


ఏమయినా సరే, అర్వింద్ కుమార్ రు. 135 ఫైన్ చెల్లించి రశీదును ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే, అసదుద్దీన్ ఫైన్ చెల్లించారో తెలియడం లేదు. అందుకే చట్టాల్ని తయారు చేసే పార్లమెంటు సభ్యుడు ఫైన్ కట్టాల్సిందే మా అందరి లాగా అని ట్విట్టర్లో గొడవ చేస్తున్నారు. అసద్ చేసింది చట్ట ఉల్లంఘన, ఆయనతో కలసి ప్రయాణించడం, చట్టోల్లంఘనను ప్రోత్సహించడమే నంటున్నారు. అసద్ ఎలా స్పందిస్తారో చూద్దాం.