తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల  ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీ రాజ్ కమిషనర్ ఆధ్వర్యంలో డిఎస్సీ కమిటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెఎన్టీయూ రిజిస్టార్ చైర్మన్ గా, అతనితో పాటు మరో 7గురు సభ్యులు కమిటిలో ఉంటారు .

డిఎస్సీ కమిటీ ద్వారా ప్రభుత్వం 9355 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాల ఎంపికకు రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్ 1- 150 మార్కులు, పేపర్ 2 – 150 మార్కులుగా పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, పేపర్2 లో తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018,పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ది, తెలంగాణ చరిత్ర, ప్రభుత్వ పథకాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అబ్జెక్టివ్ పద్దతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి ప్రశ్నకు 1/3 నెగటివ్ మార్కులు ఉంటాయి.  కొత్త జిల్లాల ప్రకారమే నియమాకాలు జరుగుతాయి. పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. డిగ్రీ అర్హతగానే పంచాయతీ కార్యదర్శుల నియామకం జరగనుంది.  జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్ధులకు రూ.250గా ఫీజును నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శుల నియమాకాలకు లైన్ క్లియర్ కావడంతో కోర్టు నుంచి ఇబ్బందులు రాకుండా నోటిఫికేషన్ జారీ చేసే పనిలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.