ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అన్నది ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువుగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా అన్ని పనులు చెక్క పెట్టవచ్చు. మనిషి జీవనంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. దీంతో మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ డిమాండ్ కి అనుగుణంగా అన్ని కంపెనీలు కొత్త ఫీచర్స్ తో ఆకర్షణీయ లుక్ తో స్మార్ట్ ఫోన్ల ను మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఒప్పో నుండి మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ను ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్(Oppo Find N2 Flip)పేరుతో మన దేశంలో విడుదల చేసింది.
ఈ ఫోల్డబుల్ ఫోన్ స్పోర్ట్స్ క్లామ్షెల్ డిజైన్ లో ఉంటుంది. ఇక ఇది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్, వెనుకవైపు మ్యాట్ గ్లాస్ తో వస్తుంది. దీనిపై లాంచింగ్ ఆఫర్ కింద దాదాపు రూ. 5,000 తగ్గింపును కూడా ఒప్పో అందిస్తోంది. ఇక ఈ ఫోన్ కి సంబందించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ స్పోర్ట్స్ లోని ప్రధాన స్క్రీన్ లో 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 1080*2520 పిక్సల్ రిజల్యూషన్ ఉంటుంది. దీనిలో 120 Hz రిఫ్రెష్ మెంట్ రేట్, 1600 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. దీని డిస్ ప్టేను సంరక్షించడానికి యూటీజీ గ్లాస్ ఉంటుంది. అలాగే 3.26 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 720*382 పిక్సల్ రిజల్యూషన్ తో ఉంటుంది. దీని సంరక్షణకు గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది.ఇది 8జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజి సామర్థ్యంతో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీనిలో వెనుక వైపు 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమరా, ఫ్రంట్ సైడ్ 32 ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.
అలాగే ఇందులో4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 44వాట్స్ సామర్థ్యంతో ఫ్లాష్ చార్జ్ సపోర్టు కూడ ఉంటుంది. ఇక దీని ధర రూ. 89,999 వరకూ ఉంటుంది. ఇక వినియోగదారులు హెచ్ డీ ఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెడీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ అండ్ అమెక్స్ వంటి కార్డులపై తొమ్మిది నెలల నోకాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే రూ. 5,000 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.అలాగే ఎక్స్చేంజ్ తో పాట లాయల్టీ బోనస్ కింద రూ. 5000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఒప్పో పాత ఒప్పో ఫోన్ ఎక్స్ చేంజ్ పై రూ. 2000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.హెడీబీ ఫైనాన్స్ వారి పేపర్ ఈఎంఐ స్కీమ్స్ పై రూ. 5,000 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.