ఎస్బిఐ తన ఖాతాదారులకు క్రెడిట్ కార్డు సేవలను కూడా అందిస్తోంది. ఈ ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ద్వారా ఎస్బిఐ కస్టమర్లు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు అయితే ఎస్బిఐ క్రెడిట్ కార్డు సేవలను పొందటానికి ఖాతాదారులు ఏడాదికి ఒకసారి SBICPSL కి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఎస్బిఐ అందిస్తున్న వివిధ రకాల సేవలకు ఎంత రుసుము వసూలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• దేశీయ అంతర్జాతీయ ఏటీఎంలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి డబ్బు డ్రా చేసినట్లైతే రూ.500 లేదా 2.50% (ఏది ఎక్కువైతే అది) చొప్పున ఛార్జ్ చేస్తారు.
• వడ్డీ రహిత గ్రేస్ పీరియడ్ : ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా వివిధ రకాల చెల్లింపులు జరిపిన తర్వాత గ్రేస్ పీరియడ్ 20 నుండి 50 రోజుల వరకు ఉంటుంది. అయితే గడిచిన నెలలో ఉన్న బ్యాలెన్స్ మొత్తం పూర్తిగా పే చేసిన తర్వాత మాత్రమే ఈ వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి వర్తిస్తుంది.
• LPC ( late payment charges) : ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు బకాయిలను సకాలంలో చెల్లించని యెడల ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 500 కంటే ఎక్కువ రూ.1000 కంటే తక్కువ బకాయి ఉన్నవారు రూ. 400 ఎక్స్ట్రా LPC చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వెయ్యి నుండి పది వేలు లోపు బకాయిలు ఉన్నవారు రూ. 750 రుసుము చెల్లించాలి. అలాగే పదివేల నుండి పాతిక వేల లోపు బకాయి ఉన్నవారు రూ. 950 రుసుము చెల్లించాలి.
• ఫైనాన్స్ ఛార్జ్ : ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు తన బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించకపోతే ఈఎంఐ వాయిదాలు సహా అన్ని లావాదేవీలపై నెలవారీ వడ్డీ రేటుతో ఫైనాన్స్ ఛార్జీలను చెల్లించాలి. ప్రస్తుతం, ఫైనాన్స్ ఛార్జీలు (లావాదేవి తేదీ నుంచి) నెలకు 3.50% (సంవత్సరానికి 42%) వరకు ఉన్నాయి.
• ఓవర్ లిమిట్ ఫీజులు: ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఎస్‌బీఐ కార్డు పరిమితిని మించి ఉంటే ఓవర్ లిమిట్ ఫీజు వసూలు చేస్తారు. ఓవర్ లిమిట్ మొత్తంలో 2.50% లేదా రూ.600 (ఏది ఎక్కువైతే అది) విధిస్తారు.
• కార్డు రీప్లేస్‌మెంట్: ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి రూ.100-250 వరకు చెల్లించాలి. ‘Aurum’ కార్డుదారుడు అయితే రూ.1500 చెల్లించాలి.