ఎస్బిఐ కస్టమర్లకు మరొక గుడ్ న్యూస్…ఇక నుండి ఉచిత క్రెడిట్ కార్డ్ సేవలు ..!

RBI brings new rules on debit and credit card transactions

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థలలో ఎస్బిఐ కూడా ఒకటి. ఈ ఎస్బిఐ బ్యాంకింగ్ సంస్థ ఇప్పటికే తన కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఎస్బిఐ అమలులోకి తీసుకువచ్చిన ఎన్నో రకాల స్కీమ్స్ ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. తాజాగా ఎస్బిఐ తన కస్టమర్లకు మరొక శుభవార్త తెలియజేసింది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ని పొందాలని అనుకుంటారు. కానీ ఈ కార్డులని పొందటానికి కొంత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా క్రెడిట్ కార్డ్ పొందే అవకాశాన్ని ఎస్బిఐ కల్పిస్తోంది.

వివరాలలోకి వెళితే… ఎస్బిఐ కస్టమర్లు క్రెడిట్ కార్డు కోసం ఇకపై ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎటువంటి చార్జీలు లేకుండానే ఎస్బిఐ తన కస్టమర్లకు ఉచిత క్రెడిట్ కార్డ్ ని అందిస్తోంది. ఎస్బిఐ అందిస్తున్న ఈ ఉన్నతి క్రెడిట్ కార్డ్ కి నాలుగేళ్ల వరకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగానికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బిఐ అందిస్తున్న ఈ ఉచిత క్రెడిట్ కార్డు ని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ క్రెడిట్ కార్డు పొందటానికి దగ్గరలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒక క్రెడిట్ కార్డు కోసం మీ వివలతో ఒక అప్లికేషన్ నింపి బ్యాంక్ లో అందించాలి. గతంలో క్రెడిట్ కార్డు కోసం ఏడాదికి రూ. 499 చెల్లించాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ చార్జీలను మాఫీ చేసి ఉచితంగానే క్రెడిట్ కార్డును అందిస్తోంది. ఈ ఉచిత క్రెడిట్ కార్డు తీసుకున్న కస్టమర్లు కార్డు తీసుకున్న తర్వాత నాలుగేళ్ల పాటు జాయినింగ్ ఫీజు, వార్షిక చార్జీలు లేకుండా ఉచితంగానే ఈ కార్డును పొంది వాడుకోవచ్చు. ఇక ఈ కార్డ్ పై ప్రతి రూ.100 ఖర్చు కు ఒక రివార్డు పాయింట్ వస్తుంది. అంతే కాకుండా కార్డు పొందిన 15 రోజుల లోగా కార్డును ఉపయోగిస్తే అప్పుడు మీకు రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది.
రూ. 25 వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఎఫ్‌డీ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ కార్డు లభిస్తుంది.