వామ్మో.. మూడో పెళ్లికి రెడీ అవుతున్న శ్రీజ.. మెగా పరువు అంతేనా?

మెగాస్టార్ చిరంజీవి అగ్ర సినీ నటుడుగా అందరికీ సుపరిచితమే. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం అన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద సెలబ్రేట్ల గురించి చిన్న విషయం లేదా చిన్న అనుమానం వచ్చినా అటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారతాయి.

ఇక అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మరో మారు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకుముందే శ్రీజ ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత కొన్ని మనస్పర్ధలు వల్ల వాళ్లు విడిపోవడం జరిగింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి మొదటి భర్తతో విడాకులు ఇప్పించి.. శ్రీజకు, కళ్యాణ్ రావు తో రెండవ వివాహం జరిపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఒక అమ్మాయి సంతానం అని కూడా అందరికీ తెలిసిందే. అయితే శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్లో తన పేరు శ్రీజ కళ్యాణ్ తీసేసి శ్రీజ కొణిదెల అని పేరు మార్చడంతో ఈ విషయంపై చాలా రూమర్స్ సోషల్ మీడియాలో చేరాయి.

ఈ వార్త తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. శ్రీజ ఎవరితోనో ప్రేమలో పడిందని.. త్వరలో ఆ వ్యక్తితో వివాహం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకునే ప్రయత్నంలో ఉందని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.

కళ్యాణ్ రావుకు, శ్రీజకు మధ్య మనస్పర్ధలు బాగా పెరిగాయని.. అందుకే త్వరలో విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ.. కళ్యాణ్ రావు కుటుంబ సభ్యులు కానీ బయట ఎక్కడ దీని గురించి ప్రస్తావించలేదు. కొందరు నెటిజన్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.