ఏపీలో బీజేపీ చాలా దూకూడు మీదున్నది. బీజేపీ దూకుడును కట్టడి చేయడం కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పాట్లు పడాల్సి వస్తోంది. నిజానికి ప్రభుత్వంపై ఏదైనా సమస్యలపై నిందలు వేస్తే అంతగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ.. వైసీపీ పార్టీ నేతలకు బీజేపీ గాలమేయడం.. ఆ గాలానికి వైసీపీ నేతలు చిక్కడమే వైఎస్సార్సీపీ హైకమాండ్ కు అర్థం కావడం లేదు.
ఇప్పటికే నరసాపురం ఎంపీ.. తన సొంత పార్టీ వైఎస్సార్సీపీకి కాకుండా బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించినప్పుడు కనీసం తన సొంత పార్టీకి కేంద్రం సమాచారం కూడా అందించలేదు. అంటే అవసరం ఉన్నప్పుడు ఎంపీలు తమకు అవసరమవుతారని.. ముందే వాళ్లను తమవైపు తిప్పుకుంటోంది బీజేపీ.
అలాగే.. మరో ఎంపీకి కూడా ఇప్పటికే బీజేపీ గాలం వేసి రెడీగా పెట్టిందట. ఇలా.. బీజేపీ ఏపీలో వైసీపీ నాయకులను తమవైపు తిప్పుకోవడం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మరింది. మరోవైపు జీఎస్టీ బకాయిలు ఏపీకి రూపాయి కూడా రాలేదు. అదేంటని అడిగితే.. ఆర్బీఐ ఉంది కదా..అక్కడ అప్పు చేసుకోండి.. అని కేంద్రం దాటవేత ధోరణి కూడా వైసీపీ ప్రభుత్వానికి చిరాకు కలిగిస్తోంది.
అయితే… కేంద్రంతో అధికారంలో ఉన్న పార్టీతో కయ్యం అవసరమా? అనే దృష్టితో సీఎం జగన్ ఉంటే.. ఆయన హుందాతనాన్ని బీజేపీ పార్టీ అలుసుగా తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తిరుపతి ఎమ్మెల్యే విషయంలోనూ బీజేపీ రచ్చ చేసింది.
అయితే.. ఇవన్నీ సీఎం జగన్ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. బీజేపీ ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కాదు.. అదును చూసి బీజేపీ దూకుడును తగ్గించాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే.. వైసీపీ నేతలు బీజేపీ వలలో చిక్కకుండా కాస్త తెలివితనం ప్రదర్శించాలని జగన్.. వైసీపీ నాయకులకు హితబోధ చేశారంటూ టాక్ వినిపిస్తోంది. చూద్దాం.. ఏపీలో బీజేపీతో.. వైసీపీ కయ్యానికి కాలు దువ్వుతుందా? లేక వియ్యం అందుకుంటుందా?