Radhe Shyam : ‘రాధేశ్యామ్’కి ఆంధ్రప్రదేశ్‌లో ‘బెనిఫిట్’ లభిస్తుందా.?

Radhe Shyam : ‘బీమ్లానాయక్’ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నానా రకాల ఇబ్బందులూ సృష్టించింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పోలీసులు, వీఆర్వోలు, ఇతర అధికారులు.. థియేటర్లలో మోహరించి మరీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా టిక్కెట్ల ధరలు ప్రభుత్వ జీవోలకు మించి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెనిఫిట్ షోలు లేవు.. అదనపు షోలు అసలే లేవు.

మరి, ‘రాధేశ్యామ్’ విషయంలో ఏం జరగబోతోంది.? నో డౌట్, రాధే శ్యామ్ సినిమా కోసం ఇబ్బందులేవీ వుండవు. ఎందుకంటే, అది పాన్ ఇండియా సినిమా. పైగా ప్రభాస్ హీరోగా నటించిన సినిమా. సో, అధికార వైసీపీ ‘రాధేశ్యామ్’ విషయమై అదనపు ప్రేమ కురిపించడానికి అన్నీ సానుకూలంగానే వున్నాయన్నమాట.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

సరేగానీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో ఏం చేయబోతున్నారు.? రాజమౌళి గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేశారన్నది నిర్వివాదాంశం. ఆ రాజమౌళితోనే అమరావతి డిజైన్లకు సంబంధించి చంద్రబాబు హంగామా చేయించారు కూడా. ఇక, రామ్ చరణ్ మెగా కాంపౌండ్‌కి చెందిన హీరో. యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ప్రచారం చేశారు.

సో, ‘రాదేశ్యామ్’ సినిమాకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించి, ‘ఆర్ఆర్ఆర్’  సినిమా దగ్గరకు వచ్చేసరికి ‘కత్తెరలు’ తప్పకపోవచ్చని సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా.? అలాగే జరుగుతుందా.? అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా జరగొచ్చు. అందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.

‘భీమ్లానాయక్’ సినిమాని అడ్డుకోవడం ద్వారా అధికార పార్టీ తన ఆలోచన సినీ పరిశ్రమపై ఏంటన్నది చెప్పకనే చెప్పేసిన దరిమిలా, తెలుగు సినీ పరిశ్రమ ఇకపై ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే ‘బిజినెస్’ చేసుకోవాల్సి వుంటుందేమో.!