మన కోసం “రాధే శ్యామ్”లో సస్పెన్స్ ఎందుకు ఉంచారో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “రాధే శ్యామ్”. మంచి అంచనాలు తెలుగు మరియు హిందీలో ఏర్పర్చుకున్న ఈ చిత్రం నుంచి ఒకో అప్డేట్ ని చిత్ర బృందం వదులుతూ నిన్న హిందీలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

మరి దీనికి భారీ లెవెల్ రెస్పాన్స్ కూడా అక్కడ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే సాంగ్ ని తెలుగు లో కొత్త లిరిక్స్, మ్యూజిక్ తో రిలీజ్ చేసారు. అయితే ఈ సాంగ్ కి నిన్న హిందీ సాంగ్ కి డిఫరెంట్ గా కట్ చేశారు. అందులో ఆసక్తికర డీటెయిల్స్ అందులో చూపించారు.

కానీ తెలుగు ఆడియెన్స్ కోసం మాత్రం ఇవి లేకుండా సస్పెన్స్ తోనే సాంగ్ ని పొందు పరిచారు. మరి ఇది హిందీ ఆడియెన్స్ ని ఆకట్టుకోడానికా లేక తెలుగు ఆడియెన్స్ లో డైరెక్ట్ గా సస్పెన్స్ తో థ్రిల్ చెయ్యాలని చూసారా అనేది వారికే తెలియాలి. చాలా వరకు అయితే తెలుగు ఆడియెన్స్ కూడా హిందీ సాంగ్ ని చూసేసారు. మళ్ళీ ఎందుకు ఇలా కట్ చేసారో మరి.