Sukumar : సుకుమార్ ఎక్కడ.? ‘పుష్ప’ విషయంలో అదొక్కటే సస్పెన్స్

Sukumar : ఇంతకీ దర్శకుడు సుకుమార్ ఎక్కడ.? ‘పుష్ప’ సినిమా ప్రమోషన్లలో దర్శకుడు సుకుమార్ కనిపించకపోవడంపై రకరకాల కథనాలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బోల్డన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో, ‘పుష్ప’ విషయంలో దర్శకుడు సుకుమార్ అస్సలు ఛాన్స్ తీసుకోవడంలేదనీ, రిలీజ్‌కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై వ్యక్తిగతంగా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడనీ అంటున్నారు.

ఇదే విషయాన్ని ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయినాగానీ, ప్రమోషన్లలో సుకుమార్ కనిపించకపోవడమేంటి.? పోనీ, సుకుమార్ ద్వారా ఓ వీడియో బైట్ అయినా రప్పించకపోవడమేంటి.? అని ఇటు ప్రేక్షకుల్లోనూ అటు సినీ వర్గాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సుకుమార్ అంటేనే మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. సినిమా విడుదలకు ముందు తన సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటానికి సుకుమార్ ఇష్టపడడు. బహుశా, అందుకేనేమో సుకుమార్, సినిమా ప్రమోషన్లలో ఎక్కువగా కనిపించడంలేదన్న వాదన వుంది.

ఇదిలా వుంటే, హీరో అల్లు అర్జున్ – దర్శకుడు సుకుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయంటూ పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. ఈ పుకార్ల విషయమై చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఒకింత అసహనం వ్యక్తం చేయాల్సి వస్తోంది. ఫైనల్ టచ్ పూర్తయ్యాక, సుకుమార్ ఖచ్చితంగా మీడియా ముందుకొస్తాడన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఈరోజు రాత్రికే ప్రీమియర్ షో పడుతుంది గనుక, పెండింగ్ వర్క్స్ ఇంకేమీ వుండకపోవచ్చు. అంటే, సుకుమార్ నుంచి కూడా మెరుపు వేగంతో ప్రమోషన్లు షురూ అవుతాయా.?