Ram Charan: మాటల మాంత్రికుడితో చరణ్ సినిమా ఎప్పుడంటే.. నిర్మాత ఏమన్నారంటే?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండడంతో మెగా అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోను వెండితెరపై చాలా రోజుల తర్వాత మళ్లీ చూస్తామని అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్‌ నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్స్ రిలీజ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు చరణ్, మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య మూవీలోనూ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా త్వరలోనే వినోదాల విందును అందించబోతుంది.

వీటితో పాటు టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ దర్శకత్వంలోనూ చరణ్ నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండడగా, మూవీకి సంబంధించిన శరవేగంగా సాగుతోంది. అంతే కాకుండా జెర్సీ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ మూవీకి చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వీటన్నటితో పాటు మరొక ముఖ్య విషయం ఏమిటంటే మాటల మాంత్రికుడుగా చెప్పుకునే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ చరణ్ ఓ సినిమాకూ సైన్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో షూటింగ్‌ మొదలుపెట్టడానికి రెడీగా ఉన్నారు. కాగా ఇటీలలే దీనికి సంబంధించి పూజా కార్యాక్రమాలు పూర్తి చేశారు. అంట్ తొందర్లోనే షూటింగ్ జరగనుందన్నమాట. ఇక త్రివిక్రమ్ తీయబోయే రామ్ చరణ్ సినిమాపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.