“రాధే శ్యామ్” క్లైమాక్స్ పై ఓ నమ్మలేని నిజం.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా “రాధే శ్యామ్” నుంచి ఇటీవలే వచ్చిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలుసు. దాని తర్వాత సినిమాలో విజువల్స్ చూసి అందరికీ మరింత ఆసక్తి పెరిగింది. ఇక మళ్ళీ ఆ తర్వాత నుంచి ఏ అప్డేట్ లేకపోయినా ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే ఏకంగా ఏడాది కష్టపడ్డారు అంటే నమ్ముతారా?

కానీ ఇదే నిజం అట. దీనిని ఈ సినిమా సినిమాటోగ్రఫర్ మనోజ్ పరమహంస తెలియజేసారు. ఈ క్లైమాక్స్ సినిమాలో చాలా కీలకమైనది అట. ఇండియన్ సినిమా దగ్గర ఆడియెన్స్ లో కొన్నాళ్ల పాటు ఈ క్లైమాక్స్ ముద్ర పడుతుంది అని ఆయన చెప్పాడు. అంతేకాకుండా దీనిని దర్శకుడు రాధా కృష్ణ చాలా కన్విన్సింగ్ గా డీల్ చేసాడని కూడా తెలిపారు. దీనితో ఈ క్లైమాక్స్ పై మరింత ఆసక్తి అందరిలో పెరిగింది.