టాక్ : “RRR” కొత్త ట్రైలర్ కి రెండు కొత్త డేట్లు.!

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం “ట్రిపుల్ ఆర్(RRR). రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈ చిత్రం మాసివ్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యడానికి ఇటీవల డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఈ డిసెంబర్ 3న మొదటగా డేట్ ని అనౌన్స్ చెయ్యగా.

మేకర్స్ మళ్ళీ లెజెండరీ సాహిత్య రచయిత సిరివెన్నెల కన్ను మూయడంతో ఈ ట్రైలర్ ని వాయిదా వేశారు. తర్వాత కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇపుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ కి రెండు డేట్ లు వినిపిస్తున్నాయి. ఈ డిసెంబర్ 7న కానీ లేదా 9న కానీ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట. మరి దీనిపైనే ఓ అధికారిక అప్డేట్ కూడా రానున్నట్టు సమాచారం.