Thrivikram Srinivas: మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఏ సినిమా అంటే?

Thrivikram Srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాలలో డైలాగులు ప్రతి ఒక ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అనుబంధంతోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకు బాధ్యతలు తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరిగి పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘వినోదయ సీతమ్’అనే సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తన సొంత బ్యానర్
పీకే క్రియేటివ్ వర్క్స్ మీద ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ‘వినోదయ సీత’ రీమేక్ తెలుగు లోకి మార్చడం కోసం ఈ సినిమా బాధ్యతలను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారకంగా తెలియజేయాల్సి ఉంది.