Mohan Babu: ఆ ఇద్దరు హీరోలే ట్రోల్ కి కారణం… జీవితంలో బాధపడతారు: మోహన్ బాబు

Mohan Babu: చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో చిన్న పాత్రలు చేస్తూ విలన్ రోల్స్ వేస్తూ చివరికి హీరోగా తన మార్కు నటనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మోహన్ బాబు హీరోగా యాక్షన్ సన్నివేశాలే కాకుండా కామెడీ మరియు తన డిఫరెంట్ స్టైల్ డైలాగ్స్ తో టాప్ హీరోస్ సరసన నిలిచారు. ఆయన నిజజీవితంలో ముక్కు సూటి మాటలవల్ల ఎపుడు టాక్ అఫ్ ది టౌన్ అవుతారు.ఆయన నట వారసులుగా వచ్చిన మంచు విష్ణు మనోజ్ లు ఫిల్మ్ హీరోస్ గా అంతగా రాణించలేక పోయారు. మనోజ్ విషయం పక్కన పెడితే మంచు విష్ణు మంచు లక్ష్మిలు వారి మాట తీరు వల్ల చాలా ఎక్కువగా ట్రోల్ కి గురవుతూంటారు.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో వీరి పై ఎక్కువగా మీమ్స్ మరియు ట్రోల్స్ రావడంతో మోహన్ బాబు దీని పై స్పందిస్తూ,మీమ్స్ ను నేను ఇష్టపడుతాను కానీ పరిమితికి మించి మా పై ట్రోల్ చేయడం నచ్చడం లేదు అని చెప్పారు. అయితే ఈ ట్రోల్ వెనుక కుట్ర దాగి ఉందని ఈ ట్రోల్స్ వెనుక ఇద్దరు అగ్ర హీరోలు ఉన్నారని కావాలనే మా కుటుంబం పై బురదజాల్లుతున్నారని చెప్పారు. ఏదో ఒక రోజు కర్మ ఫలితం అనుభవిస్తారని పేర్కొన్నారు.

ఇక మోహన్ బాబు తాజాగా నటించిన చిత్రం సన్ అఫ్ ఇండియా ఈరోజు రిలీజ్ అయింది.ఈ సినిమాను డైమండ్ రత్న బాబు డైరెక్ట్ చేసారు. మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు.మోహన్ బాబు నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాక శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను స్థాపించి యూనివర్సిటీ గుర్తింపు పొందిన సంగతి మనకు తెలిసిందే.