షూటింగ్స్ ఆపేసిన మెగాస్టార్.!తనకి ఏమయ్యింది?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో నిన్న చిరు తన మెగా అభిమానులతో కోవిడ్ సమయంలో తన ఆక్సీజెన్ సిలిండర్స్ పంపిణీ చేసే క్రమంలో కీలక పాత్ర పోషించిన వారితో భేటి అయ్యారు. అయితే ఇదే సమయంలో మెగాస్టార్ చేతికి ఒక కట్టు ఉండడం అంతా గమనించారు.

దీనితో ఆయనికి ఏమయ్యింది అని అంతా అనుకోగా దానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చిరు కి చేతి మణికట్టు ప్రాంతంలో నరం మెలిక తిరిగినందున వైద్యులను సంప్రదించారట. దీనితో చిన్న సర్జరీ పడుతుందని చెప్పారట. సో మెగాస్టార్ ఆ సర్జరీ చేయించుకొని బయటకి వచ్చేసారు. మరి దీని నుంచి కొలుకోడానికే 15 రోజులు సమయం అలా పడుతుందట. అందుకే ఇప్పుడు ఈ గ్యాప్ తీసుకున్నారు అని తెలుస్తోంది.