RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ ఫ్రీ రిలీజ్ వేడుక గురించి ఈ ఆసక్తికరమైన విషయాలివే!

RRR Movie: రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా చిత్రబృందం చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముంబైలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో భిన్నంగా, ఆశ్చర్యకరంగా ఉంది. డిసెంబర్ 19 వ తేదీ జరిగిన ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నట్లు సమాచారం. ఇకపోతే ఏ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక అయిన అన్ని టీవీ కార్యక్రమాలలో లైవ్ ఏర్పాటు చేస్తారు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం టీవీలో లైవ్ ప్రసారం కాకుండా ప్రత్యేకంగా ఒక రోజు వేడుకను టీవీలో టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం.

అదేవిధంగా ముంబైలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన రిలీజ్ వేడుక కోసం దాదాపు పది కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగే విధంగా రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.