Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో మలయాళం స్టార్స్… ఎవరంటే?

Mahesh Babu: మహేష్ బాబు న్యూ ఫిల్మ్ సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఫిల్మ్, మహేష్ మోకాలికి సర్జరీ అవడం, ఆ తర్వాత సర్కారు వారి పాట చిత్ర బృందం కరోనా బారిన పడటం తో షూటింగ్ ఆగింది. మళ్ళీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అలాగే సినిమా నుండి కళావతి అనే సాంగ్ ను ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీస్ ని వరుసగా ఓకే చేస్తున్నారు.

రాజమౌళితో పాన్ ఇండియా ఫిల్మ్ కు సైన్ చేసారు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇంకో మూవీకి కమిట్ అయ్యారు.
త్రివిక్రమ్ తో మహేష్ ఆల్రెడీ రెండు సినిమాలు చేసారు. అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా సాగిన ఇప్పటికి టెలివిజన్ లో వస్తే TRP లో దూసుకుపోతున్నాయి. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ మీద మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం ఫాన్స్ లో ఇంకా ఆశలను రేపుతోంది. త్రివిక్రమ్ మహేష్ సినిమా కోసం మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ను కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే రెండో హీరోయిన్ గా మలయాళం ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.