Leave Letter For Puspha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికి, వసూళ్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా చూడటం కోసం కొందరు విద్యార్థులు రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చెన్నై లోని భారత్ యూనివర్సిటీకి చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పుష్ప సినిమా చూడటం కోసం తమకు సెలవు కావాలని ఏకంగా హెచ్ఓడి కి లీవ్ లెటర్ రాశారు. డిసెంబర్ 17వ తేదీ పుష్ప సినిమా విడుదల కావడంతో కాలేజీకి సెలవు ప్రకటించాలని లేకుంటే తమకు లీవ్ ఇవ్వాలని విద్యార్థులు ఆ లెటర్ లోరాశారు. అదేవిధంగా మేము కళాశాలకు రానిపక్షంలో మాకు ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయవద్దని యాజమాన్యాన్ని కోరారు.
ఇలా సినిమా చూడటం కోసం లీవ్ లెటర్ రాసిన విద్యార్థులు హెచ్ఓడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మా దగ్గర ఒక ఎక్స్ట్రా టికెట్ కూడా ఉంది మీరు రావాలనుకుంటే రావచ్చని అందులో రాశారు. ప్రస్తుతం లీవ్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా సినిమా కోసం ఏకంగా యూనివర్సిటీకి లీవ్ కావాలని కోరడంతో పుష్ప సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.