పవన్ కోసం పద్దతి మార్చుకున్న ‘నిధి అగర్వాల్’

Nidhi Agerwal

టాలీవుడ్లో రెండేళ్ల క్రితం వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ తో తన మీద పడిన ఐరన్ లెగ్ ముద్రను చెరిపేసుకుంది నిధి అగర్వాల్. అమ్మడు మూవీ వచ్చి దాదాపుగా రెండేళ్లు దాటిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల దాహాన్ని తీరుస్తూ ఆ గ్యాప్ ని పూరిస్తుంటుంది. ప్రస్తుతం ఈ క్రేజీ బ్యూటీ చేతిలో రెండు భారీ బడ్జెట్ తెలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి జయదేవ్ గల్లా కొడుకు అశోక్ గల్లా డెబ్యూ మూవీ ‘హీరో’ కాగా రెండోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’. నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజైన సందర్బంగా పవన్ మూవీలో నిధి పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

The makers have released the first look of Nidhi Agerwal fro the movie Hari hara veeramallu
 

అంతేకాకుండా “చందమామ వలే సొగసైన అందాల పంచమికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ లో నిధి పాత్ర పేరుని కూడా వెల్లడించారు. ఫస్ట్ లుక్ పిక్ లో సంప్రదాయ వస్త్రాలంకారణలో నృత్య భంగిమతో నిధి ఆకట్టుకుంది. తనలోని నిధుల్నిదాచుకోకుండా ఇన్నాళ్లు అందాల ఆరబోతతో అలరించిన నిధి పాపని ఇలా చూసి ఫ్యాన్స్ మొదట షాక్ అయ్యారు. అయితే పీరియాడికల్‌ చిత్రంగా వస్తున్న హరిహరవీరమల్లులో కొత్త నిధిని చూడబోతున్నామని సంబరపడుతున్నారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.