చిరంజీవి అంటేనే ఒక పవర్ హౌస్. దాదాపు మూడు దశాబ్దాలుగా తనకు తిరుగులేకుండా టాలీవుడ్ ని శాశించిన మెగాస్టార్. చిరంజీవి తో సినిమా చెయ్యాలని ఎందరో నిర్మాతలు, దర్శకులు, నటులు కలలుకనేవారు. అప్పట్లో ఇండియా లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా చిరంజీవి రికార్డు సృష్టించాడు.
అంత క్రేజ్ ఉన్న చిరంజీవి తో పని చేయడం మాత్రం తనకు శాపంగా మారిందని ఒక ప్రముఖ నటుడు, రచయిత అన్నాడు. ఆయన ఎవరో కాదు ఎల్.బి.శ్రీరామ్. ఈవీవీ సత్యనారాయణ లాంటి స్టార్ దర్శకుల వద్ద సినిమాలకి పనిచేయడంతో పాటు చాలా సినిమాలకు డైలాగ్స్ రాశారు ఎల్.బి.శ్రీరామ్. ఆయనకి నటుడిగానూ క్రేజ్ తీసుకు వచ్చిన దర్శకులు ఈవీవీ సత్యనారాయణ. ఇక రచయితగా సెన్షేషనల్ హిట్ గా నిలిచిన నాగార్జున, సౌందర్యల ‘హలో బ్రదర్’, రాజేంద్ర ప్రసాద్ కి హిట్స్ ఇచ్చిన ‘అప్పుల అప్పారావు’, ‘ఏప్రిల్ 1 విడుదల’ లాంటి సినిమాలకి డైలాగ్స్ రాసి బాగా పాపులర్ అయ్యారు.
అదే సమయంలో చిరంజీవి ‘హిట్లర్‌కి’ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాకి డైలాగ్స్ రాసిన ఎల్.బి.శ్రీరామ్ కి మంచి పేరు వచ్చింది. ఆయన రాసిన సింపుల్ డైలాగ్స్ మెగాస్టార్ లో కొత్త మేనరిజాన్ని తీసుకువచ్చాయి. అయితే చిరంజీవి లాంటి స్టార్ హీరో తో ‘హిట్లర్’ సినిమాకి పనిచేశాక స్టార్ రైటర్ అయ్యారని ఇండస్ట్రీలో చాలామంది ఆయనకి అవకాశాలివ్వడానికి సందేహించారు. చిన్న సినిమాలు తీసేవారు ఎల్.బి.శ్రీరామ్ దగ్గరికి రాలేకపోయారు. దాంతో రచయితగా ఆయన కెరీర్ దెబ్బతినిందని ఆయనే ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు. తర్వాత కొన్నాళ్ళు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ గా మారిన శ్రీ రామ్ గారు గత కొన్ని ఏళ్ళనుండి సినిమాలకు దూరంగా ఉన్నారు.