వైరల్ : ప్రభాస్ – మహేష్ మల్టీస్టారర్ సెట్ చేసేసాడుగా

 

ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ – రానా, నాగార్జున – చైతన్య, చిరు – చరణ్ లతో ఇలా చాలానే మల్టీ స్టారర్ సినిమాలు టాలీవుడ్ ను రెడీగా ఉన్నాయి. అయితే ఈ భారీ సినిమాలకి తోడుగా ఓ బిగ్ మల్టీ స్టారర్ ని సెట్ చేసేసాడు.

అతడి మరెవరో కాదు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో ఉన్న సంగీత దర్శకుడు థమన్. తన ఫాలోవర్స్ ఏమో మహేష్ 28వ సినిమా కోసం అడిగితే దానికి థమన్ వింతైన సమాధానం ఇచ్చాడు. “ప్రభాస్ అన్న తో కలిసి అతి తొందరలోనే” ఉంటుంది అన్నట్టు చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.

దీనితో ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా మల్టీ స్టారర్ అంటూ థమన్ పైనే సెటైర్స్ పడుతున్నాయి. దెబ్బకు థమన్ మిస్టేక్ కాస్తా ప్రభాస్ – మహేష్ బాబుల భారీ మల్టీ స్టారర్ అయ్యిపోయి ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.