హైకోర్టు రియాక్ష‌న్ పై ప‌చ్చ త‌మ్ముళ్ల‌లో టెన్ష‌న్

ఇటీవ‌లి కాలంలో జ‌గ‌న్ స‌ర్కార్ పై ప్ర‌తీ అంశాలోనూ హైకోర్టులో చుక్కెద‌రవుతోన్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం, డాక్ట‌ర్ సుధాక‌ర్, బిల్డ్ ఏపీ తదిత‌ర అంశాల్లో ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. కోర్టు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఇలా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఇచ్చిన తీర్పుల‌న్నింటిని ప్ర‌తిప‌క్షం రాజ‌కీయ‌ అస్ర్తాలుగా వాడుకుంటోంది. అదే ప‌నిగా అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. టీటీడీ భూములు అమ్మ‌కాల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌డంతో సీన్ కొంచెం చ‌ల్లారింది. లేదంటే ఈ పంచాయతీ కోర్టు వ‌ర‌కూ వెళ్తే ప్ర‌భుత్వానికి మ‌రింత భంగపాటుగా ఉండేది.

ఇలా ప్ర‌తీ విష‌యంలో కోర్టు నుంచి ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లే త‌ప్ప‌..ప్ర‌భుత్వ ప‌నితీరును స్వాగ‌తించిన సంద‌ర్భం లేదు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయ‌డు లాక్ డౌన్ నిబంధ‌న ఉల్లంఘించారంటూ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం దాఖ‌లైంది. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద చంద్ర‌బాబు పై చంద్ర‌బాబు పై కేసు న‌మోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాల‌ని పిటీష‌న‌ర్ వంగా వెంక‌ట్రామి రెడ్డి, న్యాయవాది జ‌నార్ధ‌న్ రెడ్డి న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్ధించారు. చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వ‌చ్చే క్ర‌మంలో మార్గం మ‌ధ్య‌లో జ‌నాలు గుమిగూడ‌టం, బైక్ ర్యాలీల‌తో ఆహ్వానం ప‌ల‌క‌డం చేయ‌డం ద్వారా లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్లు అయింద‌ని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

దీంతో చంద్ర‌బాబు పిటీషన్ విష‌యంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ కోర్టు ఇచ్చిన ప్ర‌తీ తీర్పుపై ప్ర‌తిప‌క్షం చంక‌లు గుద్దుకుని సంబ‌ర‌ప‌డింది. ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌లు వేస్తుంటే ప‌చ్చ త‌మ్ముళ్లు మానసిక ఆనందాన్ని పొందారు. మ‌రి రేపో మాపో చంద్ర‌బాబు కేసు ప‌రిశీల‌న‌కు వ‌స్తుంది. నిబంధ‌ల‌ను ఉల్లంఘించార‌ని చంద్ర‌బాబ‌కి కోర్టు మొట్టికాయ‌లు వేస్తుందా? స‌రైన అనుమ‌తి పత్రాలు చూపించి చంద్ర‌బాబు స్కిప్ అయి త‌మ్ముళ్ల‌ను ఇరికించి చీవాట్లు తింటారా? అన్న టెన్ష‌న్ ప‌చ్చ త‌మ్ముళ్ల‌లో మొద‌లైంది. మ‌ననేత వ‌స్తున్నాడ‌ని క్యూ క‌ట్టిన బ్యాచ్ అంతా ఇప్పుడు ఉల్లంఘ‌న కింద ఉన్న‌ట్లే.